Homeటాప్ స్టోరీస్పాపం ..... ఆ సినిమాని పట్టుంచుకునే వాడే లేడు

పాపం ….. ఆ సినిమాని పట్టుంచుకునే వాడే లేడు

No buzz for manirathnams nawabమణిరత్నం సినిమా అంటే ఒకప్పుడు హాట్ కేక్ , కానీ కాలం మారింది దానికి తోడు వరుసగా చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి దాంతో ఈ దర్శకుడి సినిమాని పట్టుంచుకోవడమే మానేశారు ప్రేక్షకులు అలాగే సినిమా రంగంలోని పలువురు ప్రముఖులు కూడా . మణిరత్నం సినిమా వస్తోందంటే తెలుగు హక్కుల కోసం పెద్ద ఎత్తున పోటీ పడేవాళ్ళు కానీ ఇప్పుడు పిలిచి మరీ ఇస్తామంటే కూడా లెక్కచేయడం లేదు . సక్సెస్ మహిమ అంటే అదే ! సక్సెస్ లో ఉన్నప్పుడు మణిరత్నం వెంట పడ్డారు చాలామంది కానీ వరుస పరాజయాలు పలకరించడంతో మణిరత్నం సినిమా అంటే భయపడిపోతున్నారు కనీసం పేస్టింగ్ ఖర్చులైనా వస్తాయా ? అని .

తాజాగా మణిరత్నం భారీ కాస్టింగ్ తో నవాబ్ అనే సినిమా చేసాడు , విచిత్రం ఏంటంటే రేపే ఆ సినిమా విడుదల అవుతోంది . అయితే నవాబ్ గురించి పెద్దగా బజ్ లేకుండాపోయింది . దాంతో థియేటర్ లు కూడా పెద్దగా లభించడం లేదు , మరోవైపు నాగార్జున నాని సినిమా దేవదాస్ కూడా రిలీజ్ అవుతోంది దాంతో నవాబ్ ని పట్టించుకున్న పాపాన పోలేదు . అయితే సినిమా బాగుంది అని టాక్ వస్తే మాత్రం అది నిలబడొచ్చు లేదంటే ఇతర సినిమాల్లాగే ఇది కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అంతే !

- Advertisement -

English Title: No buzz for manirathnams nawab

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All