
నివేదా పెతురాజ్..పాపం ఈ భామ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలే సాదిస్తున్నప్పటికీ అమ్మడికి మాత్రం సెకండ్ హీరోయిన్ చాన్సులే వస్తున్నాయి తప్ప మెయిన్ హీరోయిన్ గా మాత్రం ఛాన్సులు రావడం లేదు. అయినప్పటికీ అమ్మడు ఏమాత్రం నిరాశ పడకుండా ఓకే చెపుతూ వస్తుంది. తాజాగా ఈ భామ కు మెగా ఆఫర్ వచ్చినట్లు వినికిడి.
చిరంజీవి – బాబీ కలయికలో చిరు 154 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో మెయిన్ హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా, రెండో హీరోయిన్ గా నివేదా పెతురాజ్ ను ఎంపిక చేసినట్లు వినికిడి. ఈ సినిమా వాల్తేర్ షిప్ యార్డ్ బ్యాక్ గ్రాప్ లో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీ లో మాస్ రాజా రవితేజ ఓ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు గాను రవితేజ భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.