Homeటాప్ స్టోరీస్`పాగ‌ల్‌`లో లిప్ లాక్ క‌న్ఫ‌ర్మేనా?

`పాగ‌ల్‌`లో లిప్ లాక్ క‌న్ఫ‌ర్మేనా?

Nivetha pethuraj hints kiss scene in Pagal
Nivetha pethuraj hints kiss scene in Pagal

మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్ కొత్త త‌ర‌హా సినిమాల‌కు తన కెరీర్‌ని మ‌లుచుకుంటున్నారు. ఇటీవ‌ల క్రైమ్ థ్రిల్ల‌ర్ `హిట్‌`తో త‌న ఖాతాలో మ‌రో హిట్‌ని చేర్చుకున్న విశ్వ‌క్‌సేన్ తాజాగా `పాగ‌ల్‌` అంటూ ఓ విభిన్న‌మైన ల‌వ్‌స్టోరీతో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌బోతున్నాడు. న‌రేష్ కుప్పిలి ఈ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో బెక్కెం వేణు గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నివేదా పేతురాజ్ ఇందులో మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా మ‌రో ఇద్ద‌రు సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ కూడా విశ్వ‌క్‌సేన్‌కు జోడీగా క‌నిపించ‌బోతున్నారు. ఇటీవ‌ల విశ్వ‌క్‌సేన్ చేతులు క‌ట్టేసి నివేదా పేతురాజ్ హ‌గ్ చేసుకుంటున్న స్టిల్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అంతే కాకుండా ఈ మూవీపై విశ్వ‌క్‌సేన్ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడు.

- Advertisement -

మే 1న విడుద‌ల కానున్న ఈమూవీలో నివేదాతో లిప్ లాక్ వుంద‌ని తెలిసింది. ఇదే విష‌యాన్ని నివేదా పేతురాజ్ క‌న్ఫ‌ర్మ్ చేసింది. `ముందు నన్ను దర్శకుడు సినిమా కోసం లిప్ లాక్ వుంద‌ని చెప్ప‌లేదు. స్క్రిప్ట్ చాలా అందంగా ఉంది`అని ఇండైరెక్ట్‌గా ఇందులో కిస్ సీన్ వుంద‌ని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. దీంతో త‌న సినిమాల్లో ఒక్క లిప్‌లాక్ వుండేలా చూసుకుంటూ వ‌స్తున్న విశ్వ‌క్‌సేన్ సెంటిమెంట్ ఈ మూవీలోనూ రిపీట్ అవుతోంద‌ని, సినిమాలో నివేదా, విశ్వ‌క్‌సేన్‌ల మ‌ధ్య వ‌చ్చే లిప్‌లాక్ సినిమాకు హైలైట్‌గా నిల‌వ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All