Homeటాప్ స్టోరీస్సాయి ప‌ల్ల‌వి ప్లేస్‌లో నిత్యామీన‌న్ క‌న్ఫ‌ర్మ్?

సాయి ప‌ల్ల‌వి ప్లేస్‌లో నిత్యామీన‌న్ క‌న్ఫ‌ర్మ్?

సాయి ప‌ల్ల‌వి ప్లేస్‌లో నిత్యామీన‌న్ క‌న్ఫ‌ర్మ్?
సాయి ప‌ల్ల‌వి ప్లేస్‌లో నిత్యామీన‌న్ క‌న్ఫ‌ర్మ్?

పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మూడేళ్ల త‌రువాత స్పీడు పెంచిన విష‌యం తెలిసిందే. `వ‌కీల్‌సాబ్‌` చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న ప‌వ‌ర్‌స్టార్ ఈ మూవీ త‌రువాత వెంట‌నే మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తున్నారు. ద‌గ్గుబాటి రానా కూడా ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌ల్టీస్టార‌ర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో వుంది. గ‌త కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని ప‌వ‌న్‌, రానాల‌పై చిత్రీక‌రిస్తున్నారు. సాగ‌ఱ్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో ప‌వ‌న్‌కు జోడీగా సాయి ప‌ల్ల‌వి, రానాకు జోడీగా ఐశ్వ‌ర్యా రాజేష్‌ని అనుకున్నారు.

- Advertisement -

అయితే సాయి ప‌ల్ల‌వి డేట్స్ స‌ర్దుబాటు కాని కార‌ణంగా ఈ మూవీ నుంచి త‌ప్పుకున్నార‌ట‌. ఆ స్థానంలో నిత్యామీన‌న్‌ని మేక‌ర్స్ చాలా రోజులుగా సంప్ర‌దిస్తున్నార‌ని, తాజాగా ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. త్వ‌ర‌లోనే నిత్యామీన‌న్ ఈ మూవీ సెట్‌లోకి ఎంట‌ర్ కానుంద‌ని తెలిసింది. ఇక ఇందు కోసం నిత్యామీన‌న్‌కు భారీగానే రెమ్యున‌రేష‌న్‌ని మేక‌ర్స్ అందించ‌బోతున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts