
హైలీ టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్. ఇటీవల `సైకో` `నిన్నిలా నిన్నిలా` చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అందరిలా కాకుండా ప్రత్యేకత వున్న చిత్రాలతో పాటు నటనకు ఆస్కారం వున్న పాత్రల్ని మాత్రమే ఎంచుకుంటూ నటిగా తనదైన ప్రత్యేకతని చాటుకుంటున్నారామె. ఇటీవల కొంత బొద్దుగా మారిన నిత్యామీనన్ తాజాగా స్లిమ్‌గా మారి పలువురిని ఆకర్షిస్తోంది.
న్యూ లుక్‌లో స్టన్నింగ్ మేకోవర్‌తో కనిపిస్తూ మరింత అందంగా ముస్తాబైంది. తనని తాను మార్చుకుని సరికొత్త పాత్రలకు సిద్ధమవుతోంది. ఇటీవల నిత్యా మీనన్ ప్రత్యేకంగా ఓ ఫోటోషూట్ లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. నిత్య ఈ ఫొటో షూట్‌లో లేబుల్ ఎమ్ డిజైనర్ డిజైన్ చేసిన వైట్ కలర్ పెళ్లి దుస్తులను ధరించి దేవ కన్యలా కనిపిస్తోంది.
లేబుల్ ఎమ్ డిజైనర్లు వివాహాది శుభకార్యాలకు సంబంధించిన డ్రెస్‌లని డిజైన్ చేస్తుంటారు. వారు డిజైన్ చేసిన దుస్తుల్లో నిత్యామీనన్ చాలా అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నిత్యామీనన్ `గమనం`, కోలంబి చిత్రాలతో పాటు మణిరత్నం తొలిసారి నిర్మిస్తున్న వెబ్ సిరీస్ `నవరస`లోనూ నటిస్తోంది.
View this post on Instagram