Homeగాసిప్స్నాని కి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన నిత్యా మీనన్

నాని కి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన నిత్యా మీనన్

నిన్న జరిగిన ”అ ” చిత్ర వేడుకలో నాని కి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి సంచలనం సృష్టించింది హీరోయిన్ నిత్యా మీనన్ . నాని నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం ” అ ” . కాజల్ అగర్వాల్ , నిత్యా మీనన్ తదితర ప్రముఖులు నటించిన ఈ చిత్రాన్ని ఈనెల 16న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు నాని . అయితే నిన్న హైదరాబాద్ లో ఈ చిత్ర వేడుక జరుగగా ఆ వేడుకలో పాల్గొన్న నిత్యా మీనన్ అందరికీ షాక్ ఇస్తూ నాని మాట్లాడుతున్న సమయంలో ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది . ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి .

నాని – నిత్యా మీనన్ లు కలిసి ” అలా మొదలైంది ” చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే . అప్పటి నుండి నాని – నిత్యా మీనన్ ల మధ్య మంచి స్నేహం ఏర్పడింది . దాంతో నాని కోసం అ చిత్రంలో నటించింది నిత్యా మీనన్ . ఇక ఈ వేడుకకు హాజరైన జక్కన్న అలియాస్ ఎస్ ఎస్ రాజమౌళి నాని నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్ కావాలని , అవుతుందని అంటున్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All