
యంగ్ హీరో నితిన్ వరుస ఫ్లాపుల తరువాత `భీష్మ`తో సాలీడ్ హిట్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఇదే జోష్‌తో ఇటీవల పెళ్లి చేసుకున్న నితిన్ ఇటీవలే తన కొత్త చిత్రం `రంగ్ దే` షూటింగ్‌ని ప్రారంభించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవరనాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వరుస ఎమెన్ సెంట్రిక్ చిత్రాల్లో నటించిన కీర్తిసురేష్ కొంత విరామం తరువాత నటిస్తున్న లవ్‌స్టోరీ ఇది. తాజాగా హైదరాబాద్‌లో కోవిడ్ నిబంధనల నేపథ్యంలో చిత్ర బృందం పక్కా ప్లాన్‌తో షూట్‌ని పూర్తి చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని తాజా షెడ్యూల్‌ని పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోల్ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇక మిగిలింది ఇటలీ షెడ్యూల్. ఇందు కోసం టీమ్ అంతా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఇటలీలో పాటల్ని చిత్రీకరించబోతున్నారు. ఇటీవల ప్రభాస్ `రాధేశ్యామ్` చిత్ర ఊటింగ్ కోసం ఇటలీ వెళ్లిన విషయం తెలిసిందే. ప్రభాస్ టీమ్ వెళ్లడంతో `రంగ్ దే` టీమ్ కూడా ఇటల వెళ్లేందుకు ధైర్యం చేస్తోంది. ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ ఫొటోగ్రఫీ, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కీలక పాత్రల్లో నరేష్, `ప్రేమదేశం` వినీత్, రోహిణి, గాయత్రి రఘురామ్ నటిస్తున్నారు.