
`భీష్మ` సూపర్ హిట్…ఆ వెంటనే పెళ్లి.. వంటి వరుస శుభ శకునాలతో మాంచి హుషారుమీదున్న యంగ్ హీరో నితిన్ మొత్తానికి సెట్‌లోకి ఎంటరయ్యారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `రంగ్‌దే`. రొమాంటిక్ లవ్‌స్టోరీగా వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పి.డి.వి. ప్రసాద్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
గత ఏడు నెలలుగా కరోనా వైరస్ కారణంగా చిత్రీకరణ ఆపేసిన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ బుధవారం హైదరాబాద్‌లో పునః ప్రారంభం అయింది. షూటింగ్‌కి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిత్ర బృందం షూటింగ్ ప్రారంభించింది. హీరో నితిన్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణం
పాల్గొనగా కీలక సన్నివేశాల్ని దర్శకుడు వెంకీ అట్లూరి చిత్రీకరించారు.
పలు కీలక సన్నివేశాలు, పాటల చిత్రీకరణతో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. అన్ని కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసి చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ప్రేమతో కూడిన కుటుంబ కథా చిత్రమిది. ఈ చిత్రానికి ప్రముఖ చాయాగ్రహకులు పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి ఫొటోగ్రపీని అందింస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నరేష్, వినీత్, రోహిణి, గాయత్రి రఘురామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.