Homeటాప్ స్టోరీస్శ్రీనివాస కళ్యాణం ట్రైలర్ టాక్

శ్రీనివాస కళ్యాణం ట్రైలర్ టాక్

nithin srinivasa kalyanam trailerనితిన్ రాశి ఖన్నా జంటగా శతమానం భవతి వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం ” శ్రీనివాస కళ్యాణం ”. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా అలరిస్తోంది . తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయడం విశేషం , మరో విశేషం ఏంటంటే ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు కాగా అదేరోజున శ్రీనివాస కళ్యాణం విడుదల అవుతుండటం .

ప్రేమ పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ కుటుంబకథా చిత్రాలు కోరుకునే వాళ్లకు బాగా నచ్చుతోంది . ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే చిత్రాలు తక్కువగా వస్తున్న ఈరోజుల్లో శ్రీనివాస కళ్యాణం తప్పకుండా వాళ్ళ ఆలోచనలకూ దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే . నితిన్ కూడా చాలా రోజులుగా వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్నాడు దాంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు . ఆగస్టు 9న విడుదల అవుతున్న చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే కుర్రకారు బ్రహ్మరథం పడతారని నమ్మకంగా ఉన్నారు దిల్ రాజు . ట్రైలర్ లో నితిన్ – రాశి ఖన్నా జంట బాగుంది అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ కోరుకునే అన్ని అంశాలు టచ్ చేసేలా ఉంది శ్రీనివాస కళ్యాణం .

- Advertisement -

English Title: nithin srinivasa kalyanam trailer talk

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All