
నితిన్ కథానాయకుడిగా నటించిన రోమ్ కోమ్ ఫిల్మ్ `రంగ్ దే`. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజే పాజిటివ్ టాక్‌తో సూపర్ హిట్ అనిపించుకుంది. కలెక్షన్‌ల పరంగా కూడా మంచి ఫిగర్‌లని టచ్ చేసింది.
శుక్రవారం బాక్సాఫీస్ వద్ద సందడి మొదలుపెట్టిన ఈ చిత్రం నైజాంలో 1.54 కోట్లు వసూలు చేసింది. భారత్ బంద్ వంటి భయాలు వెంటాడినా ఈ చిత్రం విషయంలో అవేవీ పని చేయలేదు. ప్రభావాన్ని చూపించలేదు. ఇక ఏపీలోనూ ఈ మూవీ హవా చూపించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌లో నితిన్‌కు హ్యాట్రిక్ హిట్‌ని అందించిన ఈ చిత్రం ఆంధ్రాలో 2.51 కోట్లు రాబట్టింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ తొలి రోజే 4.65 కోట్లు వసూలు చేయడం విశేషం.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో `రంగ్ దే` తొలి రోజు వసూళ్ల వివరాలు:
నైజాం : 1.54 కోట్లు
ఈస్ట్ గోదావరి : 0.52 లక్షలు
వెస్ట్ గోదావరి : 0.31 లక్షలు
కృష్ణా : 0.21 లక్షలు
నెల్లూరు : 0.24 లక్షలు
వైజాగ్ : 0.56 లక్షలు
గుంటూరు : 0.67 లక్షలు (హైర్)
సీడెడ్ : 0.60 లక్షలు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు షేర్ : 4.65 కోట్లు