
యంగ్ హీరో నితిన్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా మేస్ట్రో. ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయనున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.
తాజాగా ఈ చిత్రం నుండి మొదటి పాట బేబీ ఓ బేబీని విడుదల చేసారు. ఈ ఫుట్ టాపింగ్ ఎనర్జిటిక్ నెంబర్ వినగానే శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా అనురాగ్ కులకర్ణి తన ఎనర్జీతో అద్భుతమైన వోకల్స్ తో సాంగ్ ను వేరే లెవెల్ కు తీసుకెళ్లాడు. శ్రీజో అందించిన సాహిత్యం వినగానే ఆకట్టుకునేలా ఉంది.
ఇక మహతి స్వర సాగర్ అందించిన సంగీతం చాలా బాగుంది. మొత్తానికి మేస్ట్రో ఫస్ట్ సాంగ్ తో ప్రమోషన్స్ ను బాగా మొదలుపెట్టింది. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్ర పోషించింది.
Here’s #BabyOBaby Foot tapping song that fills rainbow colors to our #MAESTRO vision????
????@anuragkulkarni_
✍????#SREEJO
????@mahathi_sagar
@NabhaNatesh @MerlapakaG @SreshthMovies #SudhakarReddy #NikithaReddy #RajKumarAkella pic.twitter.com/bgA7jyWn0M— nithiin (@actor_nithiin) July 16, 2021
