
గతేడాది నితిన్ మంచి ఊపు మీద కనిపించాడు. భీష్మ సూపర్ సక్సెస్ కావడం, వరసగా లైన్లో ప్రామిసింగ్ అనిపించుకున్న చిత్రాలు చెక్, రంగ్ దే ఉండడంతో నితిన్ కెరీర్ ఇకపైకే ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే ఈ ఏడాది నితిన్ ఆశలు అడియాశలయ్యాయి. చెక్, రంగ్ దే రెండూ కూడా నితిన్ ఆశలను ఆవిరి చేసాయి.
ఈ రెండు చిత్రాల ఫలితాలతో నితిన్ ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు రిస్క్ తీసుకునే పరిస్థితిలో లేడు నితిన్. అందుకే కొన్నేళ్ల నుండి ట్రావెల్ చేస్తోన్న భారీ చిత్రం పవర్ పేటను విడిచిపెట్టినట్లు సమాచారం. లిరిసిస్ట్ నుండి దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాలనుకున్నాడు. నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించాలన్నది ప్లాన్.
అయితే గత చిత్రాల ఎఫెక్ట్ తో నితిన్ రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. అందుకే పవర్ పేట నుండి వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశాలున్నాయి.