
భారీ అంచనాల మధ్య స్వీటీ అనుష్క నటించిన ‘నిశ్శబ్ధం’ చిత్రం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. గత వారాంతంలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. సమీక్షలు కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్‌లో వ్యూస్ కూడా ఆశించిన స్థాయిలో రావడం లేదు.
సినిమా ఫలింతం తేలిపోవడంతో ఈ మూవీని చూడాలనే ఆసక్తిని ఎవరూ కనబరచడం లేదు. ఇదిలా వుంటే హైదరాబాద్ లోకల్ ఛానల్ షాక్ ఇచ్చింది. ఓ పక్క ఈ చిత్రానికి సరైన వ్యూస్ రావడం లేదని టీమ్ అంతా ఫీలవుతుంటే హైదరాబాద్ స్థానికి ఛానెల్ మాత్రం అతి త్వరలో `నిశ్శబ్దం` చిత్రాన్ని తమ ఛానెల్‌లో ప్రసారం చేయబోతున్నామని ప్రచారం చేస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న చిత్ర బృందం సదరు స్థానిక ఛానెల్‌కు లీగల్ నోటీసులు పంపించింది. కోటి 10 లక్షలు నష్టపరిహారం కింద చెల్లించాలని కోరింది. ఈ విషయం అమెజాన్ ప్రైమ్ వర్గాలకు పాకడంతో సదరు ఛానెల్‌పై అమెజాన్ కూడా 30 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందే అంటూ నోటీసులు జారీ చేసింది. దీంతో వివాదం చర్చనీయాంశంగా మారింది.