Homeటాప్ స్టోరీస్`జాగ్వార్` హీరో ఎంగేజ్‌మెంట్ హంగామా!

`జాగ్వార్` హీరో ఎంగేజ్‌మెంట్ హంగామా!

Nikhil Gowda engagement with Revathi
Nikhil Gowda engagement with Revathi

క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి గౌడ త‌న‌యుడు నిఖిల్ గౌడ `జాగ్వార్‌` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. క‌న్న‌డ‌లో హీరోగా న‌టిస్తూనే వ‌రుస తెలుగు చిత్రాల్ని రీమేక్ చేస్తూ అక్క‌డ విజ‌యాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఆయ‌న ఎంగేజ్‌మెంట్ రేవ‌తితో సోమ‌వారం బెంగ‌ళూరులోని వెస్టెండ్ హోట‌ల్‌లో అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ గురించి ఇటీవ‌లే నిఖిల్ గౌడ క‌న్న‌డ మీడియాకు స్వ‌యంగా వెల్ల‌డించారు.

తాజాగా ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌డం నిఖిల్ అభిమానుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. నిఖిల్ వివాహం చేసుకోబోతున్న రేవ‌తి క‌ర్ణాట‌క కాంగ్రెస్ లీడ‌ర్‌, మాజీ మినిస్ట‌ర్ కృష్ణ‌ప్ప‌కు మ‌న‌వ‌రాలు అవుతుంద‌ట‌. ఆమె త‌ల్లిదండ్రులు మంజు, శ్రీ‌దేవి రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్‌లో స్టేట్లోనే నెంబ‌ర్‌వ‌న్ అని తెలిసింది. ఈ ఎంగేజ్‌మెంట్‌లో జేడీఎస్ నాయ‌కుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. నిఖిల్ ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మాండ్య నుంచి ఎంపీగా న‌టి సుమ‌ల‌త‌పై పోటీప‌డి ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే.

- Advertisement -

నిశ్చితార్ధ వేడుక‌ని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించిన కుమార‌స్వామి వివాహాన్ని భారీ స్థాయిలో జ‌రిపించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌. వివాహం ఎప్పుడు వుంటుంది?. ఎక్క‌డ నిర్వ‌హించ‌బోయేది స్వ‌యంగా కుమార‌స్వామినే మీడియాకు వెల్ల‌డిస్తార‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All