Homeటాప్ స్టోరీస్ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తోన్న నిఖిల్

ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తోన్న నిఖిల్

ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తోన్న నిఖిల్
ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తోన్న నిఖిల్

యంగ్ హీరో నిఖిల్ సినీ కెరీర్ ఆసక్తికరంగా సాగుతోంది. వరసగా రెండు ప్లాపుల తర్వాత 2019లో అర్జున్ సురవరంతో సక్సెస్ కొట్టిన నిఖిల్ నుండి ఇప్పటివరకూ మరో సినిమా రాలేదు. అయితే నిఖిల్ ఏం ఖాళీగా లేడు. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న యువ నటుల్లో నిఖిల్ కూడా ఒకడు. ప్రస్తుతం నిఖిల్ నాలుగు సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు.

ఒకేసారి నాలుగు చిత్రాలు చేయడం తనకు కొత్త అనుభవం అని, ఇప్పటివరకూ ఒక సినిమా పూర్తయ్యాక మరో సినిమా చేస్తూ వచ్చానని, దీన్ని ఎలా మ్యానేజ్ చేయాలో చూడాలంటూ నిఖిల్ ట్విట్టర్ లో పోస్ట్ షేర్ చేసాడు. నిఖిల్ ప్రస్తుతం 18 పేజెస్, కార్తీకేయ 2 చేస్తున్నాడు. ఈ రెండూ కూడా చిత్రీకరణ చివరి దశల్లో ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది.

- Advertisement -

ఇదిలా ఉంటే రీసెంట్ గా రెండు చిత్రాలను ఓకే చేసాడు. ఎడిటర్ గ్యారీ దర్శకుడిగా మారి చేస్తోన్న తొలి ప్రయత్నంలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమా కూడా అనౌన్స్ అయింది. ఎక్కువ లేట్ లేకుండా ఈ రెండు చిత్రాలను కూడా పట్టాలెక్కించేసాడు నిఖిల్. వచ్చే ఏడాది కనీసం మూడు సినిమాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. చూద్దాం మరి నాలుగు పడవల ప్రయాణాన్ని నిఖిల్ ఎలా నెట్టుకొస్తాడో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All