
కొమరం పులి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన నటి నికిషా పటేల్. పవన్ – ఎస్ జె సూర్య కలయికలో వచ్చిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ..ప్రేక్షకులను అలరించడం లో ఈ మూవీ విఫలమైంది. దీంతో నికిషా పటేల్ కు మరో ఛాన్స్ లేకుండా పోయింది. తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో పలు చిత్రాలు చేసిన ఈ అమ్మడు..మళ్లీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు.
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటున్న ఈభామ..తాజాగా ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆసక్తికర సమాధానాలిచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరోల గురించి నెటిజన్లు అడగగా ఆన్సర్స్ ఇచ్చింది. మహేశ్ బాబు ఫెయిర్ అండ్ లవ్లీ అని , తన ఫేవరెట్ యాక్టర్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అని తెలిపింది. ఈ క్రమంలోనే తనతో కో స్టార్‌గా నటించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గడ్డం అంటే తనకు చాలా ఇష్టమని, ఇప్పటి వరకు ఆయనకు అదే బెస్ట్ లుక్ అని కాంప్లిమెంట్ ఇచ్చింది. అలాగే తన పెళ్లి ఫై కూడా క్లారిటీ ఇచ్చింది. యూకేలో ఉన్న వ్యక్తితో తన పెళ్లి జరగబోతున్నదని ఈ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పంది.