Homeటాప్ స్టోరీస్మెగా డాట‌ర్ పెళ్లాడే వ‌రుడు ఇతనే !

మెగా డాట‌ర్ పెళ్లాడే వ‌రుడు ఇతనే !

మెగా డాట‌ర్ పెళ్లాడే వ‌రుడు ఇతనే !
మెగా డాట‌ర్ పెళ్లాడే వ‌రుడు ఇతనే !

టాలీవుడ్ లో మెగా డాటర్ నిహారిక పెళ్లి వార్త వైరల్ అవుతోంది.  ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మోగుతున్న వేళ  నిహారిక పెళ్లిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నాగబాబు .. నిహారిక పెళ్లి వచ్చే ఏడాది ఉంటుందని స్పష్టతనివ్వడంతో వరుడు ఎవరు? అనే చర్చ మొదలైంది. దీనిపై నిహారిక సస్పెన్స్ ని కొనసాగించాలని ప్రయత్నించింది.

తాను వివాహం చేసుకోబోయే వరుడు ఎవరనే విషయంలో నిహారిక దాగుడు మూతలు ఆడాలనుకున్నా వరుడెవరో తెలిసిపోయింది. గుంటూరు కు చెందిన ఐజీ తనయుడు చైతన్య నే నిహారికకు కాబోయే వరుడు. బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన చైతన్య జెవి ఓ ఎమ్మెన్సీలో సాఫ్ట్ వేర్ గా వర్క్ చేస్తున్నాడు.
గత కొంత కాలం క్రితం నిహారిక కు అతనికి పరిచయం ఏర్పడిందట. వీరి పెళ్ళికి మెగా ఫామిలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఇరు కుటుంబాల వారు ఇప్పటికే పెళ్లిపై ఓ నిర్ణయానికి వచ్చారట. తాజాగా నిహారిక – చైతన్య కలిసి దిగిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆగస్టు లో ఎంగేమేంట్ జరపాలని ఇరు కుటుంబాల వాళ్ళు ముహూర్తం నిర్ణయించినట్టు తెలిసింది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All