
రీసెంట్ గా పబ్ లో అర్ధరాత్రి పోలీసులకు అడ్డంగా దొరికి వార్తల్లో నిలిచిన మెగా డాటర్ నిహారిక తాజాగా షార్ట్ హెయిర్ తో సరికొత్తగా కనిపించింది. బుల్లితెర ఫై యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన నిహారిక.. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. ఒకటి , రెండు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ కాకపోయేసరికి ..పెళ్లి చేసుకొని ఓ ఇంటిది అయ్యింది. 2020, డిసెంబర్9న చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకొని అటు ఫ్యామిలీ లైఫ్‌ను, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది.
కాగా గత కొన్ని రోజులుగా నిహారిక పేరు మీడియా లో ఎక్కువగా వినిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడం, ఆ తర్వాత పబ్ ఇన్సిడెంట్‌తో వార్తల్లో నిలిచిన నిహారిక.. తాజాగా తన లుక్‌ని మార్చేసింది. షార్ట్ హెయిర్‌తో ట్రెండీగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట లీక్ అయ్యాయి. న్యూ హెయిర్‌తో క్యూట్ లుక్స్‌తో నిహారిక ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి సడెన్ గా ఇలా చేంజ్ కావడానికి కారణాలు ఏంటో..