Thursday, August 11, 2022
Homeగాసిప్స్షాకింగ్ నిర్ణయం తీసుకున్న మెగా డాటర్

షాకింగ్ నిర్ణయం తీసుకున్న మెగా డాటర్

షాకింగ్ నిర్ణయం తీసుకున్న మెగా డాటర్
షాకింగ్ నిర్ణయం తీసుకున్న మెగా డాటర్

స్టార్ ఫ్యామిలీ నుండి హీరో రావడం సులువే కానీ హీరోయిన్ రావడమనేది ఎవరూ ఊహించనిది. అందులోనూ తెలుగులో అసలు హీరోయిన్ రావడమే ఎక్కువనుకుంటే ఇక స్టార్ ఫ్యామిలీ నుండి దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అయితే హిందీలో, తమిళంలో ఈ విషయంలో కొంచెం భిన్నత్వం కనిపిస్తుంది. బాలీవుడ్ లో సోనాక్షి సిన్హా, పరిణీతి చోప్రా, అలియా భట్ వంటి వారు, కోలీవుడ్ లో శృతి హాసన్, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి వారు ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినా హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అయితే టాలీవుడ్ మాత్రం ఈ విషయంలో బాగా వెనకబడిందనే చెప్పాలి. అసలు ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ నుండి, అందులోనూ ఒక ఫ్యామిలీ నుండి ఎంత మంది హీరోలు వచ్చినా ఒప్పుకుంటారు కానీ హీరోయిన్ అంటే మాత్రం ఎంకరేజ్ చేయరు. ఒకవేళ ఆ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకున్నా కూడా ఆ హీరో ఫ్యామిలీ ఫ్యాన్స్ అసలు ఒప్పుకోరు. గతంలో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి మంజుల హీరోయిన్ గా ఎంట్రీ ఇద్దామనుకుంటే ఇలాగే జరిగింది. అక్కినేని ఫ్యామిలీ నుండి సుప్రియ ఒక సినిమా చేసినా అంతవరకే పరిమితమైంది. ఆ తర్వాత సినిమాలేం చేయలేదు. ఇప్పుడు మెగా డాటర్ నిహారిక పరిస్థితి కూడా ఇంతే అయ్యేలా ఉంది.

- Advertisement -

నాగబాబు తనయురాలు నిహారిక తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కావాలని కోరుకుంది. అందుకే ముందు యాంకర్ గా తన మార్క్ చూపించి తర్వాత ఎవరూ అడుగులేయనప్పుడే వెబ్ సిరీస్ లు నిర్మించింది. ముద్దపప్పు ఆవకాయ్ అప్పట్లో సూపర్ హిట్ వెబ్ సిరీస్. ఆ తర్వాత నాన్న నాగబాబుతో కలిసి నాన్న కూచి అనే వెబ్ సిరీస్ లో కూడా తీసింది. వెబ్ సిరీస్ ల నుండి తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. నాగ శౌర్యతో ఒక మనసులో నటించినా అది దారుణంగా బెడిసికొట్టింది. తర్వాత ఎమ్మెస్ రాజు తనయుడు హీరోగా తెరకెక్కిన హ్యాపీ వెడ్డింగ్ చేసినా అది కూడా ప్లాప్ అయింది. ఫైట్ మాస్టర్ కొడుకుతో చేసిన సూర్యకాంతం కూడా దారుణంగా పోవడంతో నిహారిక మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది.

తన పెర్ఫార్మన్స్ కు మంచి స్పందన వస్తున్నా సినిమాలు ఆడకపోవడంతో తనను హీరోయిన్ గా ఒప్పుకోవడానికి జనాలు ఇష్టపడట్లేదని అర్ధం చేసుకుని ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుందిట. ఈ విషయమై నాగబాబు, చిరంజీవితో డిస్కషన్ నడిచినట్లు తెలుస్తోంది. నిర్ణయం ఏదైనా మా సపోర్ట్ ఉంటుందని చిరంజీవి అభయమిచ్చినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం నిహారిక మళ్లీ తన దృష్టి వెబ్ సిరీస్ లపై పెట్టింది. ప్రస్తుతం తన ప్రొడక్షన్ లో మ్యాడ్ హౌజ్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. 100 ఎపిసోడ్లుగా వస్తోన్న ఈ మ్యాడ్ హౌజ్ లో నిహారిక కూడా నటిస్తోందిట. ఇద్దరు అమ్మాయిలు రెంట్ కు ఉంటోన్న ఇంటికి యజమానిగా నిహారిక నటిస్తోందిట. ఇంకా ఆమె పోర్షన్ రాలేదు. మరి ఫ్యూచర్ లో ఇలా వెబ్ సిరీస్ లతోనే కంటిన్యూ అవుతుందా లేక మళ్ళీ సినిమాలవైపు ఆమె దృష్టి వెళుతుందా అన్నది చూడాలి.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts