శనివారం బంజారాహిల్స్ లోని ఫుడింగ్ మింక్ పబ్ ఫై పోలీసులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పెద్ద ఎత్తున సినీ , రాజకీయ ,వ్యాపార రంగాలకు చెందినవారు దొరికారు. వీరిలో నాగబాబు కూతురు నిహారిక కూడా ఉండడం తో ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా లో , మీడియా లో పలు వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు..ఈ వ్యవహారం ఫై స్పందించారు.
‘‘పబ్‌లో నిహారిక ఉండడం వల్లే నేను స్పందిస్తున్నాను. నిర్ణీత సమయానికి మించి పబ్ నడుపుతున్నారనే.. పోలీసులు చర్యలు తీసుకున్నారు. నా కూతురు నిహారిక విషయంలో అంతా క్లియర్. నిహారిక తప్పు లేదని పోలీసులు చెప్పారు. ఊహాగానాలకు తావివ్వకూడదనే దీనిపై స్పందిస్తున్నాను. ఈ వ్యవహారంలో తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని నాగబాబు ఓ వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసిన 150 మంది వివరాలు తీసుకొని వారికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.