Homeటాప్ స్టోరీస్నటిని మోసం చేసిన నైజీరియన్

నటిని మోసం చేసిన నైజీరియన్

Nigerian cheats Actress Sonakshi varma
Nigerian cheats Actress Sonakshi varma

టాలీవుడ్ నటి సోనాక్షి వర్మ ని మోసం చేసాడు ఓ నైజీరియన్ . మోడల్ గా , నటిగా రాణిస్తున్న సోనాక్షి వర్మ కు ఫేస్ బుక్ లో ఓ నైజీరియన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడంతో అతడ్ని యాక్సెప్ట్ చేసింది . అతడు లండన్ లో ఉంటున్నట్లు పేర్కొనడంతో చాటింగ్ మొదలు పెట్టారు . చాటింగ్ చేస్తూ ఇద్దరూ మరింత దగ్గర కావడంతో నీకు లండన్ నుండి బహుమతి పంపిస్తానంటూ చాట్ చేసి చీట్ చేసాడు నైజీరియన్ .

లండన్ నుండి పార్సిల్ వచ్చిందని అది మీకు పంపించాలంటే 85 వేల టాక్స్ చెల్లించాలని ఓ అధికారి ఫోన్ చేయడంతో నిజమే అనుకుని అతడు చెప్పిన ఎకౌంట్ లో 85 వేలు డిపాజిట్ చేసింది . అయితే డిపాజిట్ చేసినా బహుమతి రాకపోవడంతో అనుమానం వచ్చిన సోనాక్షి వర్మ తాను మోసపోయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించింది . సైబర్ నేరాలు జరుగుతున్నాయని , జాగ్రత్తగా ఉండాలని పోలీసులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు కానీ అత్యాశకు పోయి ఇలా మోసపోతున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All