Homeటాప్ స్టోరీస్హాట్ భామలకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఇస్తే..?

హాట్ భామలకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఇస్తే..?

హాట్ భామలకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఇస్తే..?
హాట్ భామలకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఇస్తే..?

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఏ దేశం అన్న తేడా లేకుండా ఈ మహమ్మారి బారిన పడి ప్రతి దేశం ఇబ్బంది పడుతోంది. భారతదేశం కూడా దానికి మినహాయింపు కాదు. కరోనా ఇండియాలో కూడా వ్యాపిస్తుండడంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెల్సిందే. మొదట ఏప్రిల్ 14 వరకూ అనుకున్న ఈ లాక్ డౌన్ ఇప్పుడు ఏప్రిల్ 30కు పొడిగించారు. కరోనాను అరికట్టాలంటే లాక్ డౌన్ ను మించిన ఉపాయం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే లాక్ డౌన్ కారణంగా సినిమాలు లేవు, షూటింగ్ లు లేవు. సినిమా వాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

హీరోయిన్లు అయితే ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో కాలక్షేపం చేస్తున్నారు. నిత్యం ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. టిక్ టాక్ లో జాయిన్ అయ్యి ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. ఇంకొంత మంది అయితే ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అని ఒకటి పెట్టి ఫ్యాన్స్ ను ప్రశ్నలు అడగమని దానికి తమదైన రీతిలో సమాధానాలు ఇస్తున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో గ్లామర్ బ్యూటీస్ పూజ హెగ్డే, నిధి అగర్వాల్ విడివిడిగా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. అయితే ఇద్దరికీ ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఫ్యాన్స్ ఇద్దరికీ ఒకేలాంటి ప్రశ్నలు అడిగారు. ఇద్దరికీ సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తే ఏం చేస్తారు అని అడగ్గా ఇద్దరి దగ్గరనుండి ఆసక్తికర సమాధానాలు వచ్చాయి.

నిధి అగర్వాల్ అయితే నాకే కనుక ఇలాంటి పవర్స్ వస్తే మనల్ని ఇంత ఇబ్బంది పెడుతున్న కరోనా మహమ్మారిని భూమ్మీద లేకుండా ప్రాలదోలుతా అని కామెంట్ చేసింది. ఇదే ప్రశ్నకు పూజ హెగ్డే ఆసక్తికర సమాధానమిచ్చింది. నాకే కనుక అలాంటి పవర్స్ వస్తే ప్రపంచం పటం మీద ఎక్కడ వేలు పెడితే అక్కడికి వెళ్లిపోతానని చెప్పుకొచ్చింది. తనకు ట్రావెలింగ్ అంటే ఇష్టమని అందుకే అలా చేస్తానని రీజనింగ్ కూడా ఇవ్వడం విశేషం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All