NGK రివ్యూ

NGK రివ్యూ
నటీనటులు : సూర్య , రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి
సంగీతం : యువన్ శంకర్ రాజా
నిర్మాత : ఎస్ ఆర్ ప్రభు , ప్రకాష్ బాబు ఎస్ ఆర్
దర్శకత్వం : సెల్వ రాఘవన్
రేటింగ్ : 2/ 5
రిలీజ్ డేట్ : 31 మే 2019

సూర్య హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” ఎన్ జి కే ” . రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి , జగపతిబాబు తదితరులు నటించిన ఈ రాజకీయ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా? లేదా ?అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ :

నందగోపాల్ (సూర్య ) ఉన్నత చదువులు చదివినప్పటికీ వ్యవసాయం మీద మక్కువతో ఉద్యోగం వదిలేసి ఊరికి చేరుకుంటాడు . స్వతహాగా ప్రజా సమస్యలపై నిత్యం స్పందించే నందగోపాల్ రాజకీయాల్లోకి వెళితేనే ప్రజలకు సరైన న్యాయం చేయగలమని భావించి రాజకీయాల్లోకి వస్తాడు . అయితే మంచి చేయాలనీ రాజకీయాల్లోకి వచ్చిన నందగోపాల్ కు రాజకీయాల్లో ఉన్న జాడ్యం ఏంటి అన్నది తెలిసిందా ? దానికోసం నందగోపాల్ ఏమి చేసాడు ? చివరకు తన లక్ష్యాన్ని చేరుకున్నాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

సూర్య
రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్
సాయి పల్లవి

డ్రా బ్యాక్స్ :

స్క్రీన్ ప్లే
డైరెక్షన్

 

నటీనటుల ప్రతిభ :

సూర్య నటన , రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి . రాజకీయ ప్రక్షాళన కోసం పోరాడే యువకుడిగా సూర్య నటన అమోఘం అనే చెప్పాలి . రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ తో అలరించింది . సాయి పల్లవి తన పాత్ర మేరకు బాగా నటించింది . జగపతిబాబు తదితరులు తమతమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు .

సాంకేతిక వర్గం :

సెల్వ రాఘవన్ ఓ సామాన్య వ్యక్తి అసామాన్య స్థాయికి చేరుకునే అంశంతో మంచి కథనే ఎంచుకున్నాడు కానీ దాన్ని సరైన దిశలో నడిపించడంలో అంటే స్క్రీన్ ప్లే రాసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాడు . అలాగే డైరెక్షన్ పరంగా కూడా ఇది పెద్ద బ్యాక్ స్టెప్ అనే చెప్పాలి . ఎందుకంటే 7 జి బృందావన కాలనీ , ఆడవారి మాటలకు అర్దాలే వేరులే , లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సెల్వ రాఘవన్ నుండా ఇలాంటి సినిమా వచ్చింది అని ఆశ్చర్యపోవడం ఖాయం . నిర్మాణ విలువలు బాగున్నాయి , విజువల్స్ కూడా , అయితే కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేసి ఉంటే బాగుండేది .

ఓవరాల్ గా :

అంతగా వర్కౌట్ అయ్యే సినిమా కాదు NGK

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All