Homeటాప్ స్టోరీస్R.R.R తర్వాత ఏంటి పరిస్థితి.?

R.R.R తర్వాత ఏంటి పరిస్థితి.?

Next projects of R R R Team
Next projects of R R R Team

ఒక పెద్ద సినిమా చెయ్యడం అనేది సడెన్ గా మన జీవితంలో వచ్చే మలుపు లాంటిదే. ఎందుకంటే కొన్ని పెద్ద సినిమాలకు విడుదలకు ముందే హిట్టు… హిట్టు అని జనాలపై రుద్దే ఒక బ్యాచ్ రెడీగా ఉంటుంది. ఆ సినిమా అయ్యాక మొదలవుతుంది అసలు కథ. మరొక సినిమా ఒప్పుకున్నదగ్గరనుండి.. ఆ సినిమా అప్డేట్స్ వస్తున్నప్పుడు, సినిమా రిలీజ్ అయ్యి ఆడుతున్నప్పుడు కూడా వెనకాల ఉన్న పెద్ద సినిమాతో పోల్చి చూస్తారు అందరూ. మొత్తానికి పెద్ద సినిమా చేసిన హీరోల పరిస్థితి రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లా అవుతుంది. ఉండాతనికి వీలు కాదు; వదలటానికి మనసు రాదు. ఈ పరిస్థితి రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులతో పనిచేసిన హీరోలకు బాగా అనుభవం.

తాజాగా R.R.R హీరోలైన రామ్ చరణ్, తారక్ ల తరువాత సినిమాల గురించి ఇప్పుడే చర్చ మొదలైంది. తారక్ ఆల్రెడీ ప్రస్తుతం ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ సర్ తో సినిమా ఫైనల్ చేసుకోగా, ఇక చరణ్ తన తరువాత సినిమాను సుజీత్ డైరెక్షన్ లో చేస్తున్నట్లు వార్తలు ఉన్నాయి. ఇది గనుక నిజమైతే సుజీత్ కి ఇది గోల్డెన్ ఆపర్చ్యూనిటీ అని చెప్పవచ్చు. ఎందుకంటే తను హైలెట్ కాకపోయినా, తను తీసే సినిమా హైలెట్ అవ్వాలని కోరుకుని, దానికి తగ్గట్టు కష్టపడే వ్యక్తులలో సుజీత్ ఒకరు. ఇక రాజమౌళి తన పద్దతికి తగ్గట్లు R.R.R తరువాత చిన్న సినిమా తీస్తారో.? లేక మరో భారీ ప్రాజెక్టు మొదలుపెడతారో ఇంకా క్లారిటీ లేదు. మొత్తం మీద రాజమౌళి గారి సినిమా తరువాత మరో సినిమా ఒప్పుకునే ముందు ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించి జాగ్రతగా స్టెప్ వెయ్యాలని, లేకపోతే ఇబ్బంది పడతామనే క్లారిటీ అయితే అందరికీ ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All