Homeగాసిప్స్ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఒలివియా పాత్రేంటి?

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఒలివియా పాత్రేంటి?

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఒలివియా పాత్రేంటి?
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఒలివియా పాత్రేంటి?

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడిన విషయం తెల్సిందే. దీనివల్ల దాదాపు మూడు నెలల విలువైన సమయాన్ని కోల్పోయింది ఆర్ ఆర్ ఆర్ టీమ్. జనవరి 8, 2021న ఈ సినిమా రిలీజ్ అని ముందు అనుకున్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సమ్మర్ కు విడుదల మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలు పోషిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాలో అలియా భట్ రామ్ చరణ్ కు జోడిగా నటించనుంది. ఇందులో ఆమెది చరణ్ కు మరదలి పాత్ర. ఇక ఎన్టీఆర్ కు జోడిగా ఒలీవియా అనే బ్రిటిష్ భామను తీసుకొచ్చారు. ఈమె రోల్ పై ఆసక్తికర వార్త ఒకటి బయటపడింది.

- Advertisement -

ఎన్టీఆర్ తో ప్రేమలో పడి, భారతీయుల స్వాతంత్ర కాంక్షను, వారి పోరాటంలో నిజాయితీకి ముగ్దురాలై చివరికి బ్రిటన్ కు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయే పాత్రలో ఒలీవియా నటిస్తుందని అంటున్నారు. ఈమె పాత్రకు జక్కన్న మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చినట్లు సమాచారం.

మరి ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుండి మొదలయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All