
హీరోయిన్ శ్రీదేవి దుబాయ్ లో మరణించిన సంగతి తెలిసిందే . అయితే ఆమె చనిపోయి ఏడాది అయినపోయినప్పటికీ ఇప్పటికి కూడా అనుమానాలు పోలేదు . తాజాగా శ్రీదేవి మరణం పై సంచలన వ్యాఖ్యలు చేసాడు కేరళ జైళ్ల శాఖ మాజీ డీజీపీ రిషి రాజ్ సింగ్ . ఖచ్చితంగా శ్రీదేవి ది హత్యే అని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు .
సహజ మరణం అయితే బాత్ టబ్ లో మునిగి చావడం అసాధ్యమని అంటున్నాడు . ఎంతగా మద్యం సేవించినా , మత్తులో ఉన్నా ఊపిరి ఆడని సమయంలో తప్పకుండా శక్తిని కూడగట్టుకునే అవకాశం ఉందని , కానీ శ్రీదేవి మరణం అలా జరగలేదని కావాలనే చంపేశారని అందుకు మరో ఉదాహరణ కూడా చెబుతున్నాడు . దుబాయ్ లో శ్రీదేవి కి ఇన్సూరెన్స్ చేయడం ఒక కారణమైతే దుబాయ్ లో మాత్రమే చనిపోతే ఆ ఇన్సూరెన్స్ వస్తుందని దీనికి ముడిపడి ఉందని , ఇన్సూరెన్స్ సొమ్ము పెద్ద మొత్తంలో ఉందని అంటున్నాడు . అయితే రిషి రాజ్ సింగ్ వాదన ని కొట్టిపడేస్తున్నాడు శ్రీదేవి భర్త బోనీకపూర్ .