
దొరసాని శివాత్మిక కూడా కన్నీళ్లు పెట్టుకుంది . నిన్న దొరసాని ప్రీ రిలీజ్ వేడుక జరిగిన విషయం తెలిసిందే . కాగా ఆ వేడుకలో మాట్లాడిన శివాత్మిక ఎమోషనల్ అయ్యింది . ఈ సినిమా కోసం అందరం కష్టపడ్డామని , తప్పకుండాదొరసాని సినిమా అందరికీ నచ్చుతుందని అంటోంది శివాత్మిక . మహేంద్ర దర్శకత్వంలో యష్ రంగినేని – మధుర శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ బాబు సపోర్ట్ కూడా ఉంది .
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి . విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో కావడం , శివాత్మిక హీరోయిన్ కావడం అందునా తెలంగాణ బ్యాక్ డ్రాప్ కావడంతో దొరసాని పై అందరి కళ్ళు పడ్డాయ్ . ఈ సినిమా హిట్ అయితే శివాత్మిక తో పాటుగా ఆనంద్ కు కూడా మంచి పేరు వస్తుంది . అయితే శివాత్మిక పై కొంతమంది అదేపనిగా ట్రోల్ చేస్తున్నారు దొరసాని కాదు దొండకాయలు , దోసకాయలు అమ్ముకునేది అంటూ . వాళ్లకు ఈనెల 12న సమాధానం చెబుతా నంటోంది శివాత్మిక .