Homeటాప్ స్టోరీస్హీరోలేనా.. మేం చూపించ‌కూడ‌దా?

హీరోలేనా.. మేం చూపించ‌కూడ‌దా?

హీరోలేనా.. మేం చూపించ‌కూడ‌దా?
హీరోలేనా.. మేం చూపించ‌కూడ‌దా?

హాట్ హాట్ వెబ్ సిరీస్‌ల‌తో కుర్ర కారుకి మ‌తిపోగొట్టిన హాట్ బెంగాలీ భాగ‌మ స్వ‌స్థికా ముఖ‌ర్జీ. పాతాల్‌లోక్ వెబ్ సిరీస్‌తో పాటు ప‌లు బాలీవుడ్ చిత్రాల్లో మెరిసింది. సోష‌ల్ మీడియాలోనూ త‌న హాట్ ఫొటోల‌తో హ‌ల్ చేసే ఈ బెంగాలీ సోయ‌గం తాజాగా చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. తాజాగా బెంగాలీ చిత్రం `త‌షేర్ గౌర్‌`లో స్వ‌స్థికా ముఖ‌ర్జీ న‌టిస్తోంది. ఈ మూవీ ప్ర‌చారంలో భాగంగా ఓ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

అయితే ఈ పోస్ట‌ర్లో స్వ‌స్థికా ముఖ‌ర్జీ బ్రా ప‌ట్టీ క‌నిపించేలా పోజ్ ఇవ్వ‌డం వివాదాస్ప‌దంగా మారింది. దీన్ని గ‌మ‌నించిన ఓ నెటిజ‌న్ పోస్ట‌ర్‌లో బ్రా క‌నిపించేలా పోజ్ ఇవ్వ‌డం అవ‌స‌ర‌మా? .. అలా చూపించ‌డానికి  క‌థ‌కు ఏదైనా సంబంధం వుందా? అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌పై స్వ‌స్థికా ముఖ‌ర్జీ ఘాటుగా స్పందించ‌డం వివాదాస్ప‌దంగా మారింది.

- Advertisement -

ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దేసీ బాయ్జ్‌, గోమోరా పోస్ట‌ర్‌ల‌ని షేర్ చేస్తూ స్వ‌స్థికా ముఖ‌ర్జీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. `మేము ఎప్పుడైనా హీరోల లో దుస్తుల్ని ద‌ర్శ‌కులు ఎందుకు చూపిస్తున్నార‌ని అడిగామా? మ‌ఆకు అలాంటి ఆలోచ‌న రాదు. కానీ మ‌హిళ‌ల లో దుస్తులు ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశ‌మే అవుతుంటాయి. అందులో ప్ర‌త్యేక‌త ఏమీ లేదు` అని ట్వ‌ట్ చేసింది.  అంతేనా హీరోలు ఇన్న‌ర్ వేర్ క‌నిపించేలా పోజులిస్తే త‌ప్పు లేదు కానీ మ‌హిళ‌ల బ్రా స్ట్రాప్ క‌నిపిస్తే మాత్రం పెద్ద ర‌చ్చ చేస్తార‌ని మండిప‌డింది. ఈ ప‌ద్ద‌తి మారాల‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All