Homeటాప్ స్టోరీస్స్టార్ హీరో వైఫ్‌ని మ‌ళ్లీ అడేసుకున్నారుగా!

స్టార్ హీరో వైఫ్‌ని మ‌ళ్లీ అడేసుకున్నారుగా!

స్టార్ హీరో వైఫ్‌ని మ‌ళ్లీ అడేసుకున్నారుగా!
స్టార్ హీరో వైఫ్‌ని మ‌ళ్లీ అడేసుకున్నారుగా!

సినిమా షూటింగ్ సెట్‌లో హీరోలు చేసే హంగామా మామూలుగా వుండ‌దు. ఇక వారికి సంబంధించిన పిల్ల‌లు, లేదా వైఫ్ వుందంటే ఆ ర‌చ్చే వేరు. అలాంటి హంగామానే ఓ స్టార్ హీరో సినిమా షూటింగ్ సెట్‌లో జ‌రిగింది. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళితే టాలీవుడ్‌లో సెన్సేష‌న‌ల్ హిట్‌గా నిలిచిన చిత్రం `అర్జున్‌రెడ్డి`. తెలుగు సినిమాల్లో గేమ్ చేంజ‌ర్‌గా సంచ‌ల‌నం సృష్టించిన ఈ చిత్ర‌ హిందీ రీమేక్‌లో షాహీద్‌ క‌పూర్ న‌టించిన విష‌యం తెలిసిందే. `క‌బీర్‌సింగ్‌` పేరుతో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌సూళ్ల సునామీని సృష్టించి దాదాపు 300 కోట్ల‌కు మించి వ‌సూలు చేసింది. దీంతో షాహీద్‌క‌పూర్ కెరీర్ ఒక్క‌సారిగా మారిపొయింది.

తెలుగు రీమేక్ స్టార్‌డ‌మ్‌ని తెచ్చిపెట్ట‌డంతో షాహీద్ క‌నున్న మ‌రో తెలుగు రీమేక్‌పై ప‌డింది. తెలుగులో నాని హీరోగా న‌టించిన `జెర్సీ` చిత్రాన్ని హిందీలో అమ‌న్ గిల్‌తో క‌లిసి దిల్ రాజు, అల్లు అర‌వింద్ రీమేక్ చేస్తున్నారు. ఇందులో షాహీద్‌క‌పూర్ హీరోగా న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది. ఇటీవ‌ల ముంబైలోని బాంద్రాలో షూటింగ్ చేశారు. ఈ లొకేష‌న్‌కి షాహీద్‌క‌పూర్ వైఫ్ మీరా రాజ్‌పుత్ వెళ్లింది. దీనికి సంబంధించిన ఓ వీడియో బ‌య‌టికి రావ‌డంతో నెటిజ‌న్స్ ఆమెపై మండిప‌డుతున్నారు. ఈ వీడీయోలో మీరా రాజ్‌పుత్ వేసుకున్న డ్రెస్‌పై కూడా సెటైర్లు వేస్తున్నారు. బ్లాక్ గౌన్‌లో హీరోయిన్ త‌ర‌హాలో హాట్‌గానే మీరా క‌నిపించ‌డం నెటిజ‌న్స్‌కి ఆగ్ర‌హాన్ని తెప్పించింది.

- Advertisement -

గ‌తంలోనూ మీరా రాజ్‌పుత్ డ్రెస్సింగ్‌పై, ఆమె బిహేవియ‌ర్‌పైనా నెటిజ‌న్స్ కాంమెంట్‌లు చేయ‌డంతో వార్త‌ల్లోకెక్కిన విష‌యం తెలిసిందే. మ‌రోసారి `జెర్సీ` రీమేక్ షూటింగ్ లొకేష‌న్‌లో అడ్డంగా బుక్క‌వ్వ‌డం బాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రి ఈ అంశంపై హీరో షాహీద్ క‌పూర్ మ‌రోసారి వైఫ్‌నే వెన‌కేసుకొస్తారో లేక ఆమెతో నెటిజ‌న్స్‌కి సారీ చెప్పిస్తారో చేడాలి అని బాలీవుడ్ జ‌నాలు అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All