Homeటాప్ స్టోరీస్నేల టిక్కెట్టు రివ్యూ

నేల టిక్కెట్టు రివ్యూ

Nela Ticket Reviewనేల టిక్కెట్టు రివ్యూ
నటీనటులు : రవితేజ , మాళవిక శర్మ , జగపతిబాబు
సంగీతం : శక్తి కాంత్ కార్తీక్
నిర్మాత : రామ్ తాళ్ళూరి
దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 25 మే 2018

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సోగ్గాడే చిన్నినాయనా , రారండోయ్ వేడుక చూద్దాం వంటి హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి నిర్మించిన చిత్రం ” నేల టిక్కెట్టు ”. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ :

నేల టిక్కెట్టు ( రవితేజ ) పేరు ఊరు లేని అనాథ , అయితే ఆనంద భూపతి ( శరత్ బాబు ) అనే పెద్దయ్య నేల టిక్కెట్టు ని చేరదీసి పెంచి పెద్ద చేస్తాడు . ఆదిత్య భూపతి ( జగపతిబాబు ) హోమ్ మినిష్టర్ , అయితే అవినీతి కి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ ఈ హోమ్ మినిష్టర్ . తల్లిదండ్రులు లేని నేల టిక్కెట్టు కి వృద్దులన్నా , వరుస పెట్టి పిలిచే వాళ్లన్నా చాలా ఇష్టం . అయితే అనుకోని విధంగా ఏకంగా హోం మంత్రి కే ఎదురుతిరుగుతాడు , హోం మినిష్టర్ చేసిన తప్పులను ప్రజలకు తెలియజేసేలా చేస్తాడు. అసలు నేల టిక్కెట్టు ఎవరు ? హోం మంత్రి ఆదిత్య భూపతి కి నేల టిక్కెట్టు కు ఉన్న గొడవ ఏంటి ? తదితర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

రవితేజ
సెంటిమెంట్ సీన్స్

డ్రా బ్యాక్స్ :

కథ
కథనం
డైరెక్షన్
సంగీతం

నటీనటుల ప్రతిభ :

నేల టిక్కెట్టు గా అనాథ పాత్రలో రవితేజ అభినయం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది , సినిమాని తన భుజ స్కంధాలపై మోసి వన్ మాన్ షో చేసాడు రవితేజ . ఎమోషనల్ సీన్స్ లో అలాగే హీరోయిన్ వెంట పడే సన్నివేశాల్లో రవితేజ మరింత చలాకీగా కనిపించాడు . హీరోయిన్ గా మాళవిక శర్మ కు నటనకు పెద్దగా స్కోప్ లేకుండాపోయింది కానీ ఉన్నంతలో మెప్పించింది అలాగే స్కిన్ షో కూడా చేసింది . హీరో ఫ్రెండ్స్ గా అలీ , ప్రియదర్శి , ప్రవీణ్ లు మెప్పించారు . జగపతిబాబు కి కొత్తరకం పాత్ర ఏమి కాదు కాబట్టి యధాలాపంగా చేసేసాడు . వీళ్లతో పాటు తెరనిండా చాలామంది ప్రముఖులు నటించారు కానీ వాళ్లకు నటించడానికి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది ….. ముఖ్యం గా బ్రహ్మానందం కు .

సాంకేతిక వర్గం :

నిర్మాణ విలువలు బాగున్నాయి , ఖర్చుకు వెనుకాడకుండా రామ్ తాళ్ళూరి నిర్మించాడు ఈ చిత్రాన్ని . శక్తి కాంత్ సంగీతం అంతగా ఆకట్టుకోదు , ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . ఇక దర్శకుడు కళ్యాణ్ కృష్ణ విషయానికి వస్తే ….. …. సోగ్గాడే చిన్ని నాయనా , రారండోయ్ వేడుక చూద్దాం వంటి చిత్రాల తర్వాత చేసిన ఈ సినిమాతో ఆ ఇంప్రెషన్ ని మాత్రం కొట్టలేక పోయాడు . అయితే కొన్ని చోట్ల తన ప్రతిభ చూపించాడు , అలాగే అక్కడక్కడా నవ్వించాడు .

ఓవరాల్ గా :

నేల టిక్కెట్టు రవితేజ మార్క్ సినిమా మాత్రం కాదు .

                      Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All