Homeటాప్ స్టోరీస్ఆ సినిమా విజయం వాళ్ళకు ఎంతో కీలకం

ఆ సినిమా విజయం వాళ్ళకు ఎంతో కీలకం

Negative publicity on ravi teja's amar akbar anthonyమాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు . కాగా ఈ సినిమా తప్పకుండా హిట్ అయి తీరాలి లేదంటే దర్శకుడిగా శ్రీను వైట్ల కు కెరీర్ ముగిసినట్లే ! అలాగే గతకొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్న రవితేజ కు కూడా తప్పనిసరిగా హిట్ కావాలి లేదంటే హీరోగా అతడి కెరీర్ కూడా మరుగున పడినట్లే దాంతో జీవన్మరణ సమస్య లా మారింది అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం . పూర్తిగా అమెరికాలో నిర్మితమైన ఈ చిత్రం పై దర్శకులు శ్రీను వైట్ల హీరో రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు . ఈ నెలలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా మంచి రిలీజ్ కోసం ఆగారు .

దాంతో రవితేజ సినిమాపై దుష్ప్రచారం జరుగుతోంది . సినిమా రిజల్ట్ ఎలా ఉంటందో అన్న భయంతోనే సకాలంలో విడుదల చేయడం లేదని నెగెటివ్ ప్రచారం సాగుతోంది . రవితేజ మూడు రకాల షేడ్స్ ఉన్న పాత్రలను పోషిస్తున్నాడు . ఇక రవితేజ సరసన ఇలియానా నటించిన ఈ చిత్రాన్ని నవంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . మైత్రి మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇద్దరి భవితవ్యాన్ని తేల్చనుంది . రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన మూడు చిత్రాలు కూడా మంచి హిట్ అయ్యాయి . నీకోసం , వెంకీ , దుబాయ్ శీను ,ఇక ఇప్పుడు ఈ సినిమా ఆ చిత్రాల సరసన నిలుస్తుందా లేక ఫ్లాప్ జాబితాలో చేరుతుందా చూడాలి .

- Advertisement -

English Title: Negative publicity on ravi teja’s amar akbar anthony

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All