Homeటాప్ స్టోరీస్నీవెవరో రివ్యూ

నీవెవరో రివ్యూ

neevevaro movie review నీవెవరో రివ్యూ :
నటీనటులు : ఆది పినిశెట్టి , తాప్సి , రితికా సింగ్
సంగీతం : అచ్చు రాజమణి , ప్రసన్
నిర్మాతలు : ఎంవివి సత్యనారాయణ , కోన వెంకట్
దర్శకత్వం : హరినాథ్
రేటింగ్ : 2. 5 / 5
రిలీజ్ డేట్ : 24 ఆగస్టు 2018

ఆది పినిశెట్టి , రితికా సింగ్ , తాప్సి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ” నీవెవరో ” . హరినాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నేనెవరో తమిళ చిత్రానికి రీమేక్ . యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

- Advertisement -

పాపులర్ రెస్టారెంట్ కి ఓనర్ అయిన కళ్యాణ్ ( ఆది పినిశెట్టి ) యుక్త వయసులోనే కళ్ళు పోగొట్టుకుంటాడు . వెన్నెల (తాప్సి ) ని ఇష్టపడతాడు కళ్యాణ్ అయితే తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెబుదామని అనుకున్న సమయంలో వెన్నెల ఏదో సమస్య లో ఉందని అర్ధం అవుతుంది దాంతో తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఇద్దామని అనుకుంటాడు కానీ అదే రాత్రి కళ్యాణ్ కు యాక్సిడెంట్ కావడంతో పోయిన కళ్ళు మళ్ళీ వస్తాయి . హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన కళ్యాణ్ వెన్నెల కోసం వెతకగా వెన్నెల ఆచూకీ లభించదు దాంతో కళ్యాణ్ స్నేహితురాలైన అను ( రితికా సింగ్ )ని పెళ్లి చేసుకోమని కళ్యాణ్ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తారు . అయితే వెన్నెల ఏమయ్యింది ? ఆమె ఆచూకీ కళ్యాణ్ కనుక్కున్నాడా ? అని ని పెళ్లి చేసుకున్నాడా ? తదితర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

ఆది పినిశెట్టి
తాప్సి
రితికా సింగ్
లైన్

డ్రా బ్యాక్స్ :

స్లో నేరేషన్
సెకండాఫ్

నటీనటుల ప్రతిభ :

ఆది పినిశెట్టి స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు , సరైనోడు చిత్రంలో విలన్ గా నటించిన ఆది రంగస్థలం చిత్రంలో కూడా గుర్తుండి పోయే పాత్ర పోషించి ప్రేక్షకుల మెప్పు పొందాడు . ఇక ఇప్పుడేమో నీవెవరో చిత్రంలో అంధుడి గా కూడా మెప్పించాడు . పెర్ఫార్మెన్స్ తోనే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లో కూడా రాణించాడు ఆది . తాప్సి కి చాలామంచి పాత్ర లభించింది , నెగెటివ్ షేడ్ పాత్ర పోషించి షాక్ ఇచ్చింది , ఈ సినిమాకే తాప్సి పాత్ర హైలెట్ గా నిలిచింది . రితికా సింగ్ కు కూడా నటనకు అవకాశం ఉన్న పాత్ర లభించింది . ఇక ఇతర పాత్రల్లో వెన్నెల కిషోర్ , శివాజీరాజా , తులసి , సప్తగిరి తదితరులు ఆకట్టుకునేలా నటించారు .

సాంకేతిక వర్గం :

అచ్చు – ప్రసన్ రాజమణి అందించిన పాటలు బాగున్నాయి అయితే రీ రికార్డింగ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు , నిర్మాణ విలువలు బాగున్నాయి సినిమాటో గ్రఫీ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . కోన వెంకట్ అందించిన కథ బాగున్నప్పటికీ కథనం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు . ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతంగా ఇచ్చారు దాంతో సెకండాఫ్ పై అంచనాలు పెరుగుతాయి కానీ ఆ అంచనాలకు తగ్గట్లుగా సెకండాఫ్ లేకపోవడం పెద్ద మైనస్ . దర్శకులు హరినాథ్ మాత్రం పూర్తిస్థాయిలో రాణించలేక పోయాడు .

ఓవరాల్ గా :

అంతగా ఆకట్టుకునేలా లేదు ఈ నీవెవరో

English Title: neevevaro movie review

Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All