Homeటాప్ స్టోరీస్నీతోనే హాయ్‌..హాయ్‌` తొలి షెడ్యూల్ పూర్తి!!

నీతోనే హాయ్‌..హాయ్‌` తొలి షెడ్యూల్ పూర్తి!!

neethone-hai-hai-movie-newsకెఎస్‌పి ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై య‌ల‌మంచిలి ప్ర‌వీణ్ స‌మ‌ర్ప‌ణ‌లో డా.ఎ.స్. కీర్తి, డా.జి.పార్థ‌సార‌థి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `నీతోనే హాయ్ హాయ్‌`. బియ‌న్ రెడ్డి అభిన‌య ద‌ర్శ‌కుడు. అరుణ్ తేజ్ , ఛ‌రిష్మా శ్రీక‌ర్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ హైద‌రాబాద్‌లో విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు బియ‌న్ రెడ్డి అభిన‌య మాట్లాడుతూ…“మా నిర్మాత‌ల పూర్తి స‌హ‌కారంతో తొలి షెడ్యూల్ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో విజ‌య‌వంతంగా పూర్తి చేశాం. న‌టీన‌ట‌లు, సాంకేతిక నిపుణులు స‌పోర్ట్ చేయ‌డంతో అనుకున్న విధంగా తీయ‌గ‌లిగాను. ఈ నెల 20 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నాం. ప‌ది రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ షెడ్యూల్ లో టాకీతో పాటు ఒక పాట చిత్రీక‌రించ‌నున్నాం. దీంతో టాకీ పార్ట్ మొత్తం పూర్త‌వుతుంది. మే నెల‌ లో మిగిలిన మూడు పాట‌లలో రెండు పాట‌లు కేర‌ళ‌లోని మున్నార్ లో , మ‌రో పాట వైజాగ్ లో చిత్రీక‌రించ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. డ‌బ్బు న్న వ్య‌క్తుల వ్వ‌క్తిత్వాలు, మ‌ధ్య త‌ర‌గ‌తి వారి మ‌న‌స్త‌త్వాలు ఎలా ఉంటాయ‌నే ఆస‌క్తిక‌ర‌మైన అంశానికి క్యూట్ ల‌వ్ స్టోరి మిక్స్ చేసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం“ అన్నారు.

చిత్ర నిర్మాత‌లు డా.ఎస్‌. కీర్తి, డా. జి. పార్థ‌సార‌థి రెడ్డి మాట్లాడుతూ…“బి.య‌న్.రెడ్డి గారికి సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్నఅనుభ‌వంతో అద్భుతంగా తొలి షెడ్యూల్ ఎక్క‌డా ఇబ్బంది లేకుండా పూర్తి చేశారు. ఏ విష‌యంలో రాజీ ప‌డ‌కుండా సినిమాను గ్రాండ్ గా నిర్మించ‌డానికి ద‌ర్శ‌కుడికి అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తున్నాం. ద‌ర్శ‌కుడిగా త‌న‌కు నిర్మాత‌లుగా మాకు మంచి పేరు తెచ్చి పెట్టే చిత్ర‌మ‌వుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఇక మీద‌ట జ‌ర‌గ‌బోయే షెడ్యూల్స్ లో కూడా మా యూనిట్ ఇలాగే స‌హ‌క‌రిస్తార‌ని ఆశిస్తున్నాం. కృష్ణ ప్రియ పై చిత్రీక‌రించిన ఐట‌మ్ సాంగ్ సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలుస్తుంద‌ని“ అన్నారు.

- Advertisement -

చిత్ర స‌మ‌ర్ప‌కులు య‌ల‌మంచిలి ప్ర‌వీణ్ మాట్లాడుతూ…“ సీనియ‌ర్ న‌టీన‌ట‌లుతో పాటు ప్ర‌తిభావంతులైన సాంకేతిక నిపుణుల‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ద‌ర్శ‌కుడు బియ‌న్ రెడ్డిగారికి సినీ ఇండ‌స్ర్టీలో ఉన్న అపార‌మైన అనుభ‌వంతో సినిమాను అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు. వైద్య‌రంగంలో ఎంతో పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చుకున్న ప్ర‌ముఖ న్యూరాల‌జిస్ట్ డా.ఎస్‌.కీర్తిగారు, గైనాకాల‌జిస్ట్ డా.జి. పార్థ‌సార‌థిరెడ్డిగారు ఈ చిత్రాన్ని రాజీ ప‌డ‌కుండా అభిరుచితో నిర్మిస్తున్నారు“అన్నారు.

ఆనంద్‌, బెన‌ర్జీ, ఏడిద శ్రీరామ్‌, జ‌య‌చంద్ర‌, ర‌త్న ప్ర‌భ‌, శ్రీప్రియ‌, జ‌బ‌ర్ద‌స్త్ రామ్ ప్ర‌సాద్, జ‌బ‌ర్ద‌స్త్ ప‌వ‌న్‌, అడప రామారావు, ర‌వి ఆనంద్, త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి డి.ఓ.పిః ఈద‌ర ప్ర‌సాద్; సంగీత ద‌ర్శ‌కుడుః ర‌వి క‌ళ్యాణ్‌; సాహిత్యంః వెంక‌ట బాలగోని, ప్ర‌వీణ్‌; కొరియోగ్ర‌ఫీః సాయి రాజ్‌; ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః మ‌ట్టా కృష్ణారెడ్డి; కో-డైర‌క్ట‌ర్ః న‌వీన్‌; ఫైట్స్ః ర‌వి; ఆర్ట్ః సుబ్బారావు పి.ఆర్‌.ఓః ర‌మేష్ చందు; అసోసియేట్ డైర‌క్ట‌ర్ః మ‌హేష్‌; అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ః వెంక‌ట్ డి, సిసింద్రి; ప‌బ్లిసిటీ డిజైన‌ర్ః ఇమేజ్ 7; మేక‌ప్ః బి.య‌న్‌.బాబు; కాస్ట్యూమ్స్ః కృష్ణ‌; స‌మ‌ర్ప‌ణః య‌ల‌మంచిలి ప్ర‌వీణ్‌; ప్రొడ్యూస‌ర్స్ః .డా. ఎ.స్. కీర్తి, డా.జి.పార్థ‌సార‌థి రెడ్డి; క‌థ‌-స్ర్కీన్ ప్లే-డైలాగ్స్-డైర‌క్ష‌న్ః బి.య‌న్‌.రెడ్డి అభిన‌య.​

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All