Homeటాప్ స్టోరీస్#NBK107 ఫస్ట్ లుక్ ..బాలయ్య మజాకా

#NBK107 ఫస్ట్ లుక్ ..బాలయ్య మజాకా

#NBK107 ఫస్ట్ లుక్ ..బాలయ్య మజాకా
#NBK107 ఫస్ట్ లుక్ ..బాలయ్య మజాకా

అఖండ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ..ప్రస్తుతం తన 107 మూవీ షూటింగ్ లో బిజీ అయ్యారు. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. బాలయ్య కు జోడిగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా , థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.  శుక్రవారం నుండి ఈ మూవీ షూటింగ్ మొదలు అవ్వగా..మొదటి రోజే సినిమా సెట్ లోకి కొన్ని పిక్స్ లీక్ అవ్వడం మేకర్స్ ను షాక్ కు గురి చేసాయి. ఇందులో బాలకృష్ణ పిక్ సైతం లీక్ కు గురైంది. ఈ తరుణంలో మేకర్స్ అధికారికంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేసి అభిమానుల్లో ఉత్సహం నింపారు.

ఈ ఫస్ట్ లుక్ లో బాలయ్య మైనింగ్ ఏరియాలో నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని స్టైలిష్ గా ఇంటెన్స్ గా నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపించరు. పంచె కట్టులో బ్లాక్ షర్ట్ ధరించి విభిన్నమైన గెటప్ లో బాలయ్య అదరగొట్టారు.  నెరిసిన జుట్టు .. తెల్లటి గడ్డం .. నుదుటన బొట్టు ..ఒక చేతికి వాచ్ ..మరో చేతికి రుద్రాక్ష మాల ధరించి బాలయ్య ఆకట్టుకున్నారు.

- Advertisement -

వాస్తవ సంఘటనల ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని ,  బాల‌కృష్ణ ఇందులో ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లో  నటిస్తుండగా.. క‌న్న‌డ స్టార్ దునియా విజ‌య్ ఇందులో విల‌న్‌గా న‌టిస్తున్నారు.ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుద‌ల చేసేలా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All