Homeటాప్ స్టోరీస్గజిని చెత్త సినిమా.. నయన్ షాకింగ్ కామెంట్స్

గజిని చెత్త సినిమా.. నయన్ షాకింగ్ కామెంట్స్

Nayantara comments on Gagini movie
Nayantara comments on Gagini movie

సూర్య కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చిన బాక్స్ ఆఫీస్ హిట్ మూవీ గజిని. ఆల్ టైమ్ ఫెవేరేట్ హిట్ సినిమాల్లో ఈ సినిమా టాప్ లో ఉంటుందని ప్రతి తమిళ సినీ ప్రేక్షకుడు చెబుతాడు. ఇక అదే సినిమాతో సూర్య తెలుగు ఆడియెన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక దర్శకుడు మురగదాస్, హీరోయిన్ ఆసిన్, మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జై రాజ్ కెరీర్స్ కూడా ఆ సినిమాతో ఒక్కసారిగా హై రేంజ్ కి వెళ్లాయి.

వీరందరితో పాటు సెకండ్ హీరోయిన్ నయనతారకి కూడా సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. ఆ సినిమా అనంతరం చంద్రముఖి లాంటి హిట్టు పడటంతో ఇప్పటివరకు బేబీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే అంతలా కెరీర్ కి యూ టర్న్ ఇచ్చిన సినిమాపై నయన్ ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేసింది. తన కెరీర్ లొనే అదో చెత్త సినిమా అంటూ అసలు ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది అని ఇటీవల ఒక రేడియో ఇంటర్వ్యూలో చెప్పింది.
“దర్శకుడు మురగదాస్ కథ చెప్పిన విధానం ప్రకారం నా పాత్రే మెయిన్ హీరోయిన్ గా హైలెట్ అవుతుందని అనుకున్నా. ఆసిన్  సెకండ్ హీరోయిన్ గా కనిపిస్తుందని బావించా. కానీ సినిమా మేకింగ్ అనంతరం సెకండ్ హీరోయిన్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది” అని నయనతార వివరణ ఇచ్చింది. ఆ సినిమా సక్సెస్ ఇచ్చినప్పటికి నయన్ ఎందుకలా కామెంట్ చేసిందో ఎవరికి అర్థం కాలేదు. నయన్ కామెంట్స్ కి సూర్య అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All