
విజయ్ సేతుపతి , సమంత , నయనతార ప్రధాన పాత్రల్లో విగ్నేష్ శివన్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం కాతు వాకుల రెండు కాదల్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అంత పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రివ్యూ ను సమంత, నయనతార చూసారు. ఈ సినిమా చూసిన అనంతరం నయనతార ఎమోషనల్ కు గురై సమంతను కౌగలించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
‘కణ్మణి, ఖతిజ’ అనే క్యాప్షన్ తో ‘కాతు వాకుల రెండు కాదల్’ అనే సినిమా పేరుతో వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, నెటిజన్లు వీడియోను రీ ట్వీట్ చేస్తున్నారు. అలా ఆ వీడియో తెగ వైరలవుతోంది. దీనిని నయనతార బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ‘లవ్ యూ ’ అని మీనింగ్ వచ్చేలా సింబల్స్ పెట్టి రీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ట్రై యాంగిల్ లవ్ స్టోరి ‘కాతు వాకుల రెండు కాదల్’ చేశారు. ఈ సినిమాపైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. సినిమా డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్ అందించగా..ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
❤️❤️❤️??????? https://t.co/UW819ml3iB
— Vignesh Shivan (@VigneshShivN) April 18, 2022