Homeన్యూస్నయ సుల్తానా అరుపులు,కేకలు, అలకలు, గలాట గీతూ ఓవర్ యాక్షన్

నయ సుల్తానా అరుపులు,కేకలు, అలకలు, గలాట గీతూ ఓవర్ యాక్షన్

నయ సుల్తానా అరుపులు,కేకలు, అలకలు, గలాట గీతూ ఓవర్ యాక్షన్
నయ సుల్తానా అరుపులు,కేకలు, అలకలు, గలాట గీతూ ఓవర్ యాక్షన్

బిగ్ బాస్6 షోపై రోజు రోజుకు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇక ఎప్ప‌టిలాగే.. బిగ్‌బాస్ హౌస్ గొడ‌వ‌లు గ్యాంగ్‌ల ఫైట్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటికే గలాటా గీతూ వాయిస్ హౌస్ లో ఎక్కువగా వినిపిస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో కూడా గీతూ.. మరోసారి రచ్చ చేసింది. నయ సుల్తానా అరుపులు,కేకలు, అలకలు, గలాట గీతూ ఓవర్ యాక్షన్ తో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరికింది. అలాగే ఆరోహి తాను ఎక్కువగా సూర్యతోనే ఉంటానని రీజన్ తో రేవంత్ తనను ట్రాష్ లో వేశాడని, అందుకే నేను అందరితో మాట్లాడటానికి ట్రై చేస్తున్నా అని చెప్పుకుంది.

అటు ఈ విషయం గురించి రేవంత్ అర్జున్ మాట్లాడుకుంటుండగా అర్జున్ రేవంత్ కు సలహా ఇచ్చాడు. ఇలాంటి రీజన్స్ వల్ల ట్రాష్ లో వేస్తే నువ్వే బ్యాడ్ అవుతావు అని అన్నాడు కానీ రేవంత్ లైట్ తీసుకున్నాడు. మెరినా .. ఇనయ, ఆరోహి, సూర్య, శ్రీహాన్ దగ్గర చర్చ పెట్టింది. తన భర్తను హగ్ చేసుకుంటుంటే.. హగ్ సరిగ్గా ఇవ్వడం లేదంటూ చెప్పుకొచ్చింది. ప్రేమగా హగ్ చేసుకుంటుంటూ ఉంటే విదిలించుకుని వెళ్లాడంటూ చెప్పింది మెరినా. నేనేమీ అంత ఓవర్ చేయలేదంటూ రోహిత్ చెప్పుకున్నాడు. ఇక రేవంత్ కు క్లాస్ తీసుకునే ప్రయత్నం చేసింది గీతూ.. మాట్లాడేటప్పుడు ఓ పది సెకన్లు ఆలోచించి మాట్లాడండి.. మీ మంచికే చెబుతున్నా.. మీ గురించి అందరూ నెగెటివ్ మాట్లాడుతున్నారు.. అంటూ సలహాలు ఇచ్చింది గీతూ.క్లాస్ టు ట్రాష్.. ట్రాష్ టు క్లాస్ చేంజ్ చేసుకునే అవకాశాన్ని బిగ్ బాస్ ఇచ్చాడు. దీనిలో సునాయా, రేవంత్, గీతూ చర్చించుకున్నారు. ఒకరు క్లాస్ కి వెళ్లాల్సి ఉంది.

- Advertisement -

దీనిలో గీతూ సింపతీ ప్లే చేయడంతో రేవంత్ త్యాగం చేయాల్సి వచ్చింది. బాలాదిత్య తనంతట తానే ట్రాష్‌లోకి వచ్చాడు. మళ్లీ స్లైడ్ జరా స్లైడ్ జరా స్లైడ్ అనే టాస్క్‌లో రేవంత్ చేతిలో అభినయ ఓడిపోయింది. టాస్క్ ఓడటంతో అభినయ ట్రాష్‌లోచకి వచ్చింది. రేవంత్ ట్రాష్ నుంచి మాస్‌లోకి వెళ్లిపోయాడు.రోల్ బేబీ రోల్ టాస్క్ లో నేహా గెలవడంతో క్లాస్ టీంలోకి వెళ్ళింది. నేహా క్లాస్‌లోకి రావడంతో.. క్లాస్ నుంచి సూర్య మాస్‌లోకి వస్తాడు. కెప్టెన్సీ టాస్క్ కూడా ఆడాలని ఉందంటూ ఆది రెడ్డి చెప్పడంతో సూర్య క్లాస్ నుంచి మాస్‌కు వచ్చేశాడు. క్లాస్‌లో గీతూ, ఆది రెడ్డి, నేహాలు ఉన్న నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు. ట్రాష్ సభ్యులైన ఇనయ, అభినయ, బాలాదిత్యలు నామినేట్ అయ్యారని చెబుతాడు బిగ్ బాస్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All