
అనుష్క చాల గ్యాప్ తర్వాత తన కొత్త చిత్ర షూటింగ్ లో పాల్గొనబోతుంది. అనుష్క , నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో మహేష్‌బాబు దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కబోతుంది. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈనెల 4నుంచి ఈ మూవీ రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకోనుందని చిత్ర బృందం.. శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
ఇది అనుష్కకు 48వ సినిమా. అలాగే నవీన్ పొలిశెట్టికి హీరోగా మూడో సినిమా. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు చేశారు అనుష్క శెట్టి. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి.. 2018లో లేడీ ఓరియెంటెడ్ భాగమతి సినిమాలను యు.వి.క్రియేషన్స్ నిర్మించారు.
ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. భాగమతి సినిమా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఒకేసారి విడుదలై అద్భుతమైన విజయం అందుకుంది. ఇందులో తనదైన నటనతో అందరినీ మెప్పించారు అనుష్క శెట్టి. ఇప్పుడు మూడోసారి అనుష్క యు.వి.క్రియేషన్స్ కలిసి సినిమా చేయబోతున్నారు.