
ప్రతి ఏడాది ఫిల్మ్ ఛాంపియన్ వారు ఇచ్చే దిస్ రప్ టర్స్ 20 లిస్ట్ లో ఈసారి టాలీవుడ్ నుండి ఇద్దరు స్టార్స్ స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి 20 లిస్ట్ లో టాప్ 3గా నిలిచాడు. అంతకుముందు సైడ్ రోల్స్ వేస్తూ వచ్చిన నవీన్ పొలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా మెప్పించాడు. ఆ తర్వాత జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.
జాతిరత్నాలు సినిమాకు నవీన్ ఇమేజ్ డబుల్ అయ్యిందని చెప్పొచ్చు. అనుదీప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించారు. ఇక ఈ సినిమాలో నటనకు గాను ఎఫ్సీ 2021 లిస్ట్ లో స్థానం సంపాదించాడు నవీన్ పొలిశెట్టి. ఫిల్మ్ ఛాంపియన్ లిస్ట్ లో టాప్ 3 గా నవీన్ తన సత్తా చాటాడని చెప్పొచ్చు.
ప్రస్తుతం నవీన్ రెండు మూడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు చేస్తున్నాడని తెలుస్తుంది. త్వరలోనే వాటికి సంబందించిన డీటైల్స్ బయటకు వస్తాయి.