
నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘జాతి రత్నాలు’. డైరెక్టర్ స్వప్న సినిమా బ్యానర్‌పై టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుదీప్ కె.వి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని సాధిస్తోంది.
కలెక్షన్‌ల పరంగా ట్రేడ్ వర్గాలని విస్మాయానికి గురిచేస్తోంది. ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పటికే ప్రాఫిట్‌లోకి వచ్చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లని సాధిస్తూ రికార్డులు సృష్టిస్తున్న ఈ మూవీ తాజాగా అమెరికా బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ మార్కును తాకింది. పాండమిక్ అనంతర కాలంలో ఈ మైలురాయిని సాధించిన మొదటి భారతీయ చిత్రంగా ఈ మూవీ రికార్డుని సాధించింది.
‘జాతి రత్నలు’ మార్చి 10 న యుఎస్‌ఎలో విడుదలైంది. మొదటి వారంలో 800 కే డాలర్లు వసూలు చేసింది. అయినప్పటికీ రెండవ వారంలో అదే వేగాన్ని కొనసాగించలేకపోయింది. తాజాగా ఈ చిత్రం మూడవ వారంలో 1 మిలియన్ మార్కును తాకింది.