Homeగాసిప్స్స్టార్ డైరెక్టర్ సినిమాలో యువ హీరో విలన్ !!

స్టార్ డైరెక్టర్ సినిమాలో యువ హీరో విలన్ !!

స్టార్ డైరెక్టర్ సినిమాలో యువ హీరో విలన్ !!
స్టార్ డైరెక్టర్ సినిమాలో యువ హీరో విలన్ !!

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల డైరెక్టర్ వి.వి.వినాయక్‌ని హీరోగా పరిచయం చేస్తూ.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎన్. నరసింహ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా సీనయ్య (కంప్లీట్ ఎమోషన్). ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయ్యింది. వినాయక్ ఈ సినిమాలో మెకానికి మరియు రైతు పాత్రల్లో కనిపించబోతున్నాడు.

అక్టోబర్ 9న వినాయక్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ టైటిల్ రిలీజ్ చేసిన మూవీ టీమ్ అదే రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఇది 1982-84 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ అని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇక మెకానిక్ గా పనిచేసుకునే సీనయ్య తన కూతురిని చంపిన వారిపై ఎలా రివెంజ్ తీసుకున్నాడు అనే లైన్ పై ఈ సినిమా నడుస్తుందని అంటున్నారు. ఈ లైన్ తో చాలా సినిమాలు వచ్చాయి గతంలో, కానీ స్టోరీ రొటీన్ అయినప్పటికీ రివెంజ్ డ్రామా డిఫరెంట్ ఉంటుందని రియాలిటీ ఎమోషన్ సినిమా స్థాయిని పెంచుతుందని అంటున్నారు. మణిశర్మ సంగీతం అందించనున్న ఈ సినిమాలో వినాయక్ కి విలన్ గా నవీన్ చంద్ర నటించనున్నాడని అంటున్నారు.

- Advertisement -

నవీన్ చంద్ర హీరోగా సినిమాలు చేస్తూనే నెగిటీవ్ రోల్స్ చేస్తున్నాడు. ఇటీవలే నవీన్ నెగిటీవ్ పాత్రలో చేసిన అరవింద సమేత సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. వినాయక్ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All