
టాలీవుడ్‌లో వున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా పెళ్లిళ్లు చేసుకుంటూ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్‌బై చెప్పేస్తున్నారు. అయితే యంగ్ హీరో నవదీప్ మాత్రం పెళ్లీడొచ్చినా ఇప్పటికీ బ్యాచిలర్ గానే బండి లాగించేస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా ఈ యంగ్ హీరో పెళ్లికి రెడీ అవుతున్నాడంట వార్తలు జోరందుకున్నాయి. బుల్లితెర యాంకర్ తో గత కొంత కాలంగా నవదీప్ సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో శ్రీముఖి ఇండైరెక్ట్‌గా వీరి డేటింగ్ కహానీని బయటపెట్టడంతో అసలు విషయం బయటికి వచ్చింది. ఆ యాంకర్ `పోరా పోవే` ఫేమ్ భీమినేని విష్ణు ప్రియ అని బయటపడింది. విష్ణు ప్రియ కూడా నవదీప్ పై తనకున్న ప్రేమని వ్యక్తం చేయడానికి వెనకాడేది కాదట. దీంతో ఇండస్ట్రీ వర్గాల్లో వీరిద్దరి గురించి హాట్ చర్చ జరగడం మొదలైంది.
కానీ నవదీప్ మాత్రం ఇదంతా వట్టి రూమరే అని కొట్టి పారేస్తున్నారు. దీన్ని పెద్దదిగా చేసి చూపించొద్దని మీడియాని కోరుతున్నాడు. విష్ణు ప్రియ జస్ట్ ఫ్రెండ్ మాత్రమేని, అనవసరంగా రూమర్‌లని స్ప్రెడ్ చేయకండని నవదీప్ చెబుతున్నాడు. కానీ ఇండస్ట్రీ వర్గాలు మాత్రం ఇద్దరి మధ్య డేటింగ్ నడుస్తోందని వాదిస్తున్నారు.