Homeటాప్ స్టోరీస్ఆ రేసులో లేనంటున్నాడు!

ఆ రేసులో లేనంటున్నాడు!

ఆ రేసులో లేనంటున్నాడు!
ఆ రేసులో లేనంటున్నాడు!

టాలీవుడ్‌లో వున్న బ్యాచిల‌ర్స్ గ్రూప్ క్ర‌మ క్ర‌మంగా త‌గ్గిపోతోంది. ఇండ‌స్ట్రీలో వున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ అంతా వ‌రుస‌గా పెళ్లికి రెడీ అయిపోతున్నారు. ఇప్ప‌టికే కొంత మంది పెళ్లి చేసుకుంటే మ‌రి కొంత మంది ఎంగేజ్‌మెంట్ తంతు పూర్తి చేసుకుని పెళ్లి కోసం సిద్ధమ‌వుతున్నారు. క‌రోనా కార‌ణంగా ప‌రిస్థితులు మార‌డంతో యంగ్ హీరో నిఖిల్ అత్యంత స‌న్నిహితుల మ‌ధ్య వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే.

ఇక ఎంగేజ్‌మెంట్ పూర్తి చేసుకున్న నితిన్ డెస్టినేష‌న్ వెడ్డింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. క‌రోనా ప్ర‌భావం కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాక త‌ను అనుకున్న స్థాయిలో వివాహం చేసుకోవాల‌ని నితిన్ ప్లానింగ్‌లో వున్నారు. ఇదిలా వుంటే రానా ద‌గ్గుబాటి ఆగ‌స్టు 8న మిహీకా బ‌జాజ్‌ని వివాహం చేసుకోబోతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ద‌గ్గుబాటి ఫ్యామిలీ పెళ్లి ఏర్పాట్లలో బిజీగా మారిపోయింది. ఇదిలా వుంటే యంగ్ హీరోన‌వ‌దీప్ కూడా త‌న బ్యాచిల‌ర్ జీవితానికి బై బై చెప్పేస్తూ సీక్రెట్ వెడ్డింగ్‌కి రెడీ అవుతున్నాడంటూ వార్త‌లు షికారు చేస్తున్నాయి.

- Advertisement -

అయితే ఈ 35 ఏళ్ల యంగ్ బ్యాచిల‌ర్ మాత్రం త‌ను ప్ర‌స్తుతం సింగిల్‌నే అని పెళ్లి ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేద‌ని, ర‌హ‌స్య వివాహం చేసుకోవ‌డం లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. చాలా మందితో డేటింగ్ చేసినా ఇంకా త‌ను వివాహం చేసుకోవాల‌నే నిర్ణ‌యానికి ఇంకా రాలేద‌ని న‌వ‌దీప్ వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. న‌వ‌దీప్ ప్ర‌స్తుతం సినిమాల్లో న‌టిస్తూనే వెబ్ సిరీస్‌ల‌తో బిజీగా వున్నారు. ఇటీవ‌లే ఆయ‌న న‌టించిన మ‌స్తీస్‌, ర‌న్ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యాయి. అవుతున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All