
కరోనా వైరస్ కారణంగా క్రేజీ చిత్రాల్ని ఇప్పట్లో థియేటర్లలో రిలీజ్ చేయడం అసాధ్యంగా మారింది. దీంతో థియేటర్లు తెరిచేంత వరకు మా చిత్రాన్ని ఓటీటీల్లో ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయబోమని భీష్మించుకు కూర్చున్న వాళ్లంతా ప్రస్తుతం అదే బాట పట్టాల్సి వస్తోంది. అలా ఇష్టం లేకున్నా ఓటీటీ బాటపడుతున్న చిత్రాల్లో నాని, సుధీర్‌బాబు నటించిన `వి` చిత్రం కూడా వుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మించారు.
నాని తొలిసారి ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టెక్నికల్‌గా సినిమా హై స్టాండర్డ్స్‌లో వుండటంతో సినిమా కొత్తగా వుంటుందనే ప్రచారం మొదలవడంతో ఈ సినిమా కోసం చాలా మందే ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 5న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందం ఇప్పటికే పూర్తయింది. 33 కోట్లకు ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. త్వరలోనే దీనికి సంబంధించిన ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నారు.
ఇదిలా వుంటే ఈ చిత్రానికి బంపర్ ఆఫర్ లభించిందని తెలిసింది. తెలుగులో క్రేజీ చిత్రాలుగా నిలిచిన సినిమాల్ని రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు పోటీపడుతున్నారు. `వి` చిత్రాన్ని కూడా బాలీవుడ్‌లో నిర్మాత దిల్ రాజుతో కలిసి ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఓ ప్రముఖ బాలీవుడ్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోఏ అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది.