Homeటాప్ స్టోరీస్ఆ సినిమా సెలెక్ట్ కాకపోవడానికి కారణం ఇదే

ఆ సినిమా సెలెక్ట్ కాకపోవడానికి కారణం ఇదే

National film award rejects Co kancharapalemకేరాఫ్ కంచరపాలెం అనే సినిమా గత ఏడాది తెలుగులో విడుదలై అందరి ప్రశంసలను పొందింది , పైగా అవార్డు కూడా కొట్టేయడం ఖాయమని అనుకున్నారు అంతా కానీ అసలు జాతీయ అవార్డుల లిస్ట్ లో ఈ చిత్రం ఎంపిక కాలేదు దాంతో ఖంగుతిన్నారు ఆ చిత్ర బృందం . ఈ సినిమా నేషనల్ అవార్డు కు సెలెక్ట్ కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా ……. ఓ ఎన్నారై మహిళ నిర్మించడమే ! తెలుగు అమ్మాయి అయినప్పటికీ అమెరికాలో డాక్టర్ గా పనిచేస్తున్న పరుచూరి ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మించడమే అసలు కారణం .

భారతీయ పౌరురాలు కానీ పరుచూరి ప్రవీణ నిర్మించిన చిత్రం కావడంతో కేరాఫ్ కంచరపాలెం జాతీయ స్థాయి అవార్డుల కేటగిరి లో ఎంపిక కాలేకపోయింది . దాంతో తన బాధని వ్యక్తం చేస్తూ దర్శకులు వెంకటేష్ మహా కు క్షమాపణ చెబుతూ ట్వీట్ చేసింది . దానికి దర్శకుడు మహా రీ ట్వీట్ చేస్తూ మరింత అసహనం ప్రదర్శించాడు . అలాగే అవార్డుల అర్హత ల లిస్ట్ లో మార్పులు రావాలని కోరుకుంటున్నాడు . సహజత్వాన్ని దగ్గరగా ఉన్న కేరాఫ్ కంచరపాలెం చిత్రం కు ఈ రకంగా అన్యాయం జరిగింది . అందరి ప్రశంసలు దక్కినప్పటికీ ప్రభుత్వ అవార్డు కు మాత్రం దూరమయ్యింది .

- Advertisement -

English Title: National film award rejects C/o kancharapalem

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All