Homeన్యూస్బిగ్ బాస్ విన్నర్ ఎవరో గెస్ చేసిన నటరాజ్ మాస్టర్!

బిగ్ బాస్ విన్నర్ ఎవరో గెస్ చేసిన నటరాజ్ మాస్టర్!

బిగ్ బాస్ విన్నర్ ఎవరో గెస్ చేసిన నటరాజ్ మాస్టర్!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో గెస్ చేసిన నటరాజ్ మాస్టర్!

టీవీ ప్రోగ్రామ్స్ కు కొరియోగ్రాఫ్ చేయడం ద్వారా పాపులర్ అయిన నటరాజ్ మాస్టర్ ఈ సీజన్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. నటరాజ్ స్వభావం తెల్సిన వాళ్ళు ఎవరైనా ఇంకా ఎక్కువ రోజులు బిగ్ బాస్ లో ఉంటాడని అనుకున్నారు కానీ నాలుగు వారాలకే ఎలిమినేట్ అయ్యాడు. తాను తనలా, ఏ ముసుగు లేకుండా ఉంటే ప్రజలకు నచ్చుతానని భావించానని, కానీ ప్రేక్షకులు గ్రూపులు కట్టే వారినే ఎక్కువ ఆదరిస్తున్నారని తెలిపాడు. ఇది తనకు బాధ కలిగిస్తోందని వాపోయాడు.

ఇకపోతే షణ్ముఖ్, జెస్సీ, సిరి కలిసి ఆడుతున్నారని అది వారికే మంచిది కాదని నటరాజ్ మాస్టర్ సలహా ఇచ్చాడు. ప్రస్తుత వారం నామినేషన్స్ లో షణ్ముఖ, జెస్సీ ఇద్దరూ ఉన్న విషయం తెల్సిందే. ఇకపోతే లేటెస్ట్ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారో కూడా తేల్చి చెప్పేసాడు నటరాజ్ మాస్టర్.

- Advertisement -

ప్రస్తుతమున్న ఆట బట్టి చూస్తే శ్రీరామ్ చంద్ర, మానస్ లు చాలా గట్టి పోటీదారులని వీరిద్దరిలో ఎవరో ఒకరు కచ్చితంగా బిగ్ బాస్ విన్నర్ అవుతారని బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్ ఐదవ వారంలో ఉంది. నామినేషన్స్ లో రవి, మానస్, షణ్ముఖ్, జెస్సీ, విశ్వ, లోబో, సన్నీ, హమీద, ప్రియాలు ఉన్నారు. మరి వీరిలో ఈ వారం ఎలిమినేషన్ లో నటరాజ్ మాస్టర్ ను ఎవరు ఫాలో అవుతారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All