Homeన్యూస్న‌ట‌న‌ రివ్యూ

న‌ట‌న‌ రివ్యూ

natana movie reviewస‌మ‌ర్ప‌ణ‌: భ‌విరి శెట్టి రామాజంనేయులు, రాజ్య‌ల‌క్ష్మి
నిర్మాణ సారథ్యం: గురుచ‌ర‌ణ్‌
నిర్మాణ సంస్థ‌: కుభేర ఆర్ట్స్
న‌టీన‌టులు: మ‌హీధ‌ర్‌, శ్రావ్యారావు, భానుచంద‌ర్‌, ర‌ఘుబాబు, ప్ర‌భాస్ శ్రీను, ర‌ఘువ‌ర్మ‌, సూర్య‌, న‌ళిని, జ‌బ‌ర్‌ద‌స్త్ ఫ‌ణి, అప్పారావు, దొర‌బాబు, శార‌దా సాహిత్య‌, సూర్య కుమారి త‌దిత‌రులు
ఎడిట‌ర్‌: వి.నాగిరెడ్డి
సంగీతం: ప్ర‌భు ప్ర‌వీణ్ లంక‌
ఆర్ట్‌: విజ‌య్ కృష్ణ‌
సాహిత్యం: భార‌తీబాబు
లైన్ ప్రొడ్యూస‌ర్స్‌: ఎన్‌.వెంక‌టేశ్వ‌ర‌రావు, అక్కినేని శ్రీనివాస‌రావు
కెమెరా: వాసు
నిర్మాత‌: కుభేప్ర‌సాద్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: భార‌తీబాబు
సస్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశాలు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాలంటే స‌న్నివేశాలు గ్రిప్పింగ్‌గా ఉండాలి. అలాంటి చిత్రాలే ప్రేక్ష‌కులను ఆకట్టుకుంటాయి. ఈ చిత్రాల‌ను తెర‌కెక్కించాలంటే పెద్ద‌గా ఖ‌ర్చు కాక‌పోవ‌చ్చుకానీ.. ద‌ర్శ‌కుడు స‌న్నివేశాల‌ను ఎంత బాగా మ‌లిచాడ‌నే దానిపై సినిమా విజ‌యం ఆధార‌ప‌డి ఉంటుంది. ప్ర‌తి వారం స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంటాయి. అలా ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సినిమా న‌ట‌న‌. అస‌లు న‌ట‌న అంటే ఏంటి? ద‌ర్శ‌కుడు భార‌తీబాబు ఈ చిత్రం ద్వారా ఏం చెప్పాల‌నుకున్నాడు? దాదాపు కొత్త న‌టీన‌టుల‌తో చేసిన ఈ ప్ర‌య‌త్నం ఎంత మేర ఫ‌లించిందో తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో చూద్దాం…

 

- Advertisement -

క‌థ:
శ్రీరాం(మ‌హీధ‌ర్‌) హీరో కావాల‌నుకుంటాడు.. అందుకోసం డైరెక్ట‌ర్ కావాల‌నుకునే త‌న స్నేహితులతో క‌లిసి ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. అంద‌రికీ జాన‌కి(శ్రావ్యారావ్‌) కామ‌న్ ఫ్రెండ్‌. శ్రీరాం, జాన‌కి మ‌ధ్య ప‌రిస్థితుల ప్ర‌భావంతో ప్రేమ ప‌డుపుతుంది. వీరి ప్రేమ‌ను జాన‌కి తండ్రి సూర్య కూడా ఆశీర్వ‌దిస్తాడు. సినిమా రంగంలో రాణించాల‌నుకునే వీరంద‌రికీ శంక‌ర‌న్న‌(ప్ర‌భాస్ శ్రీను) అండ‌గా ఉంటాడు. అయితే శంక‌ర‌న్న త‌మ‌ను వాడుకుంటున్నాడ‌ని భావించిన వీరు ఆర్‌.కె(ర‌ఘుబాబు) ద‌గ్గ‌ర‌కు వెళ‌తారు. అత‌ను వీళ్ల‌ను మోసం చేస్తాడు. దాంతో మ‌ళ్లీ శంక‌ర‌న్న వీరికి స‌పోర్ట్ చేస్తాడు. అదే స‌మ‌యంలో ఊరి అవ‌త‌ల పెద్ద బంగ‌ళాలోని ఓ పనివాడు య‌జ‌మానికి చంపి.. ఆస్థిని అనుభ‌విస్తున్నాడ‌ని.. య‌జ‌మాని కూతురు కూడా అత‌ని కంట్రోల్‌లోనే ఉంద‌ని.. వాడిని చంపేస్తే ఆస్థి అనుభ‌వించ వ‌చ్చున‌ని ఓ ముస‌లాడు శంక‌ర‌న్న‌కు చెబుతాడు. దాంతో శంక‌ర‌న్న శ్రీరాం, అత‌ని స్నేహితుల‌కు షూటింగ్ చేస్తున్నామ‌ని చెప్పి ఆ బంగ‌ళాకు తీసుకెళ‌తాడు. ఆ బంగళాలోని భూప‌తి.. వారికి షూటింగ్ చేసుకోమ‌ని అనుమ‌తి ఇస్తాడు. అయితే క్ర‌మంగా వారిలో కెమెరా మెన్ దొర‌బాబు, కో డైరెక్ట‌ర్ ఫ‌ణి, శంక‌ర‌న్న అంద‌రూ చ‌నిపోతారు. ఆ చావుల‌కు కార‌ణం ఎవ‌రు? అస‌లు భూప‌తి ఎవ‌రు? చివ‌ర‌కు శ్రీరాం, జాన‌కి ప్ర‌మాదం నుండి ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

స‌మీక్ష‌:
భానుచంద‌ర్‌, ప్ర‌భాస్‌శ్రీను, ర‌ఘుబాబు, సూర్య వంటి కొత్త న‌టీన‌టుల‌తో పాటు మ‌హీధ‌ర్‌, శ్రావ్యారావు వంటి కొత్త‌వారు కూడా సినిమాలో చ‌క్క‌గా న‌టించారు. పాత్ర‌ల ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు. సినిమా ఫ‌స్టాఫ్ అంతా హీరో, అత‌ని స్నేహితులు సినిమా రంగంలో రాణించాల‌నుకోవ‌డం.. వారు చేసే ప్ర‌య‌త్నాలు.. హీరో హీరోయిన్ మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాల‌తో సాగిపోతుంది. ఇక ఇంట‌ర్వెల్ త‌ర్వాత భాను చందర్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. శివోహం అంటూ కాస్త అనుమానంగా సాగే ఈ పాత్ర అంద‌రిలోనూ ఆస‌క్తిని రేకెత్తించింది. బంగ‌ళాలో జ‌రిగే స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా అనిపిస్తాయి. ప్ర‌భు ప్ర‌వీణ్ లంక నేప‌థ్య సంగీతం.. న‌ట‌న టైటిల్ సాంగ్ బావుంది. కెమెరా ప‌నితంనం బావుంది. ప్ర‌భాస్ శ్రీను, ర‌ఘుబాబు, అప్పారావు, ఫ‌ణి మ‌ధ్య కామెడీ స‌న్నివేశాలు బావున్నాయి. ద‌ర్శ‌కుడు భార‌తీబాబు సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. అయితే స‌న్నివేశాల‌ను మ‌రింత ఆస‌క్తిక‌రంగా మ‌లుచుకుని ఉండాల్సింది. పాత్రల డిజైనింగ్‌లో మ‌రింత కేర్ తీసుకుని ఉండుంటే బావుండేది. ఎడిటింగ్ విష‌యం శ్ర‌ద్ధ వ‌హించాల్సింది. కొన్ని స‌న్నివేశాలు క‌నెక్టింగ్ మిస్ అయ్యాయి. జీవితంలో న‌ట‌న అప్పుడ‌ప్పుడు ఉండాలి. కానీ.. న‌ట‌నే జీవితం అయితే అనుకోని ప్ర‌మాదాలు ఏర్ప‌డతాయ‌నే చెప్పే చిత్ర‌మిది.
చివ‌ర‌గా.. న‌ట‌న‌.. ఆక‌ట్టుకుంటుంది
రేటింగ్‌: 3/5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All