Homeటాప్ స్టోరీస్వెంక‌టేష్ `నార‌ప్ప‌` రిలీజ్ కూడా ఆగింది!

వెంక‌టేష్ `నార‌ప్ప‌` రిలీజ్ కూడా ఆగింది!

వెంక‌టేష్ `నార‌ప్ప‌` రిలీజ్ కూడా ఆగింది!
వెంక‌టేష్ `నార‌ప్ప‌` రిలీజ్ కూడా ఆగింది!

కోవిడ్ సెకండ్ వేవ్ దేశాన‌ప్ని ఓ కుదుపు కుదిపేస్తోంది. ప్ర‌మాద‌క‌ర స్థాయిలో కేసులు పెరుగుతుండ‌టం, అంత‌కంత‌కూ మ‌ర‌ణాలు సంభ‌విస్తుండ‌టం, క‌నీసం చ‌నిపోయిన వారిని ద‌హ‌నం చేయ‌డానికి కూడా చోటు ల‌భించ‌ని ద‌ర్భ‌ర‌స‌రిస్థితులు మొద‌లై భాయాన‌క వాతావ‌ర‌ణం తాండ‌విస్తోంది. ఈ నేప‌థ్యంలో కీల‌క రంగాల‌న్నీ స్వ‌చ్చందంగా మూత‌ప‌డుతున్నాయి.

ఇప్ప‌టికే ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగానికి సంబంధించి థియేట‌ర్లు మూసి వేయ‌డంతో సినిమా రిలీజ్లు కూడా వాయిదా ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న `నార‌ప్ప‌` రిలీజ్ కూడా వాయిదా ప‌డింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ప్ర‌క‌ట‌న‌ని విడుద‌ల చేసింది. త‌మిళ హిట్ చిత్రం `అసుర‌న్‌` ఆధారంగా విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా సురేష్‌బాబు నిర్మిస్తున్నారు.

- Advertisement -

ముందు ఈ చిత్రాన్ని మే 14న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అయితే తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ చిత్ర రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్టుగా ప్ర‌క‌టించారు. `నారప్ప‌` కోసం అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఈ సంద‌ర్భంగా వారికి మా మ‌న‌వి. ప్ర‌స్తుతం వున్న ప‌రిస్థితుల్లో మ‌నంద‌రి ఆరోగ్యం, ర‌క్ష‌ణ దృష్టిలో ఉంచుకుని `నార‌ప్ప‌` రిలీజ్‌ని వాయిదా వేస్తున్నామ‌ని తెలియ‌జేస్తున్నాం. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌రువాత అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం` అని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ వెల్ల‌డించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All