Homeటాప్ స్టోరీస్ఆగిపోయిందనుకున్న సందీప్ కిషన్ సినిమా ఓటిటిలో

ఆగిపోయిందనుకున్న సందీప్ కిషన్ సినిమా ఓటిటిలో

ఆగిపోయిందనుకున్న సందీప్ కిషన్ సినిమా ఓటిటిలో
ఆగిపోయిందనుకున్న సందీప్ కిషన్ సినిమా ఓటిటిలో

యువ హీరో సందీప్ కిషన్ తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తున్నాడు. అయితే తమిళంలో సందీప్ కిషన్ చేసిన చిత్రమొకటి విడుదలకు నోచుకోలేక ఆగిపోయింది. ఆ చిత్రమే నరకాసురన్ . సందీప్ కిషన్ తో పాటు అరవింద్ స్వామి, శ్రియ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం పూర్తై దాదాపు మూడేళ్లు కావొస్తోంది.

16 వంటి చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకున్న కార్తిక్ నరేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. అయితే గౌతమ్ మీనన్ కు ఉన్న ఆర్ధిక ఇబ్బందుల కారణంగా నరకాసురన్ విడుదలకు నోచుకోలేదు.

- Advertisement -

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల చేస్తున్నారు. సోనీ లివ్ లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమాను తెలుగులో నరకాసురుడు పేరుతో విడుదల చేస్తున్నారు. అయితే ఎప్పుడు విడుదల చేస్తారు అన్నది మరి కొద్ది రోజుల్లో తేలిపోతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All