
గత కొంత కాలంగా రేసులో వెనకబడ్డారు నారా రోహిత్. ఆయన నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. శ్రీ విష్ణుతో కలిసి ఆయన నటించిన చిత్రం `వీర భోగ వసంతరాయలు`. ఈ సినిమా తరువాత నారా రోహిత్ నుంచి మరో సినిమా రాలేదు. ఆ ముందు చేసిన చిత్రాలన్నీ కూడా వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి.
కొత్త దనం పేరుతో కొత్త వాళ్లతో నారా రోహిత్ చేసిన సినిమాలన్నీ ఫేడవుట్ కాన్సెప్ట్‌లతో వచ్చినవే కావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో నారా రోహిత్ కెరీర్ ఇక అయిపోయినట్టేనా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. వాటికి బ్రేకిస్తూ నారా రోహిత్ న్యూ లుక్‌లో ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు. ప్రత్యేక ట్రైనర్ సహాయంతో బొద్దుగా వున్న నారా రోహిత్ కాస్తా మ్యాన్లీ లుక్‌లోకి మారిపోయారు.
బారు గడ్డంతో స్లిమ్‌గా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్న లుక్ ప్రసత్తుం ట్రెండ్ అవుతోంది. అయితే నారా రోహిత్ ప్లాన్‌లకి కరోనా పెద్ద అడ్డంకిగా మారింది. దీంతో కొన్ని రోజులుగా కొత్త ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న రోహిత్ త్వరలో ఓ భారీ చిత్రాన్ని చేయబోతున్నారట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రాబోతోందని తెలిసింది.